Seethakka: మేడారం మహాజాతర పనులను పరిశీలించిన మంత్రి సీతక్క
ABN , Publish Date - Feb 03 , 2024 | 03:18 PM
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం సమక్క - సారలమ్మ జాతర ఈనెల 21 నుంచి ప్రారంభంకానుంది. జాతర తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి సీతక్క మేడారం మహాజాతర ప్రాంగణానికి చేరుకున్నారు.
ములుగు, ఫిబ్రవరి 3: తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం సమక్క - సారలమ్మ జాతర ఈనెల 21 నుంచి ప్రారంభంకానుంది. జాతర తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి సీతక్క (Minister Seethakka) మేడారం మహాజాతర ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ జరిగే పనులను మంత్రి పరిశీలించారు. ఆపై కొండాయి గ్రామంలోని గోవిందరాజులు, నాగులమ్మ , సారలమ్మలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. దొడ్ల వద్ద జంపన్నవాగుపై కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గత సంవత్సరం వరదలకు గోవిందరాజులు, సారలమ్మ, నాగులమ్మ ఆలయ ప్రాంతాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. జాతర ప్రాంగణం, వివిధ మరమ్మత్తులకు బడ్జెట్ రిలీజ్ చేశామన్నారు. జాతర పనుల బిల్లులు ఇవ్వడంలో గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందన్నారు. పాత బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు ప్రస్తుత జాతర పనులను ఆపితే ఊరుకునేది లేదన్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఫారెస్ట్ అనుమతులు లేకపోవడంతో కొన్ని రోడ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయన్నారు. మరో నాలుగు రోజుల్లో అన్ని రోడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...