Ponnala Lakshmaiah: రేవంత్‌రెడ్డికి ఆయనకు అంతర్గత ఒప్పందం.. పొన్నాల లక్ష్మయ్య షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:54 PM
పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.. కనీసం తెలంగాణ గవర్నర్‌ను కలిశారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.కాంట్రాక్టర్లు రూ,200 కోట్లు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా అని ప్రశ్నించారు.
హనుమకొండ: అసెంబ్లీ పేరుతో సినిమా చూపెట్టారని.. అందులో హీరో ఎవరో విలన్ ఎవరో ప్రజలు అర్థం చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంట్రాక్టర్లు రూ,200 కోట్లు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా అని ప్రశ్నించారు. ఆదానితో రేవంత్‌రెడ్డికి అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే ఆయనపై రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి ఆదానిపై ఫిర్యాదు చేయలేదన్నారు.
ప్రజలను తప్పు దారిపట్టించేందుకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం మూడున్నర రెట్లు పెరిగిందని అన్నారు. నిజ జీవితంలోనూ లోన్ అనేది ఒక భాగమన్నారు.అప్పులు ఉన్నాయి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అంటున్నారు.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కడా ఇలా లేదని అన్నారు. లోన్లు పరిమితులకు లోబడే వస్తాయని స్పష్టం చేశారు. పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.. కనీసం తెలంగాణ గవర్నర్‌ను కలిశారా అని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.
హైడ్రాతో పేదలను రోడ్డున పడేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
పదేళ్ల పాటు అన్ని పండుగలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా జరిపారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బతుకమ్మ పండుగకు చీరలు.. రంజాన్, క్రిస్మస్ పండుగలకు గిఫ్ట్స్ అందించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హైడ్రాతో పేదలను రోడ్డున పడేస్తున్నారు.. రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అన్నారని.. ఇప్పటికైనా ప్రతీకార పాలన వీడాలని ప్రార్థిస్తున్నానని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Allu Arjun: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై ఊహించని పరిణామం
CM Revanth Reddy: మానవత్వం లేదా ?
Child Custody: పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
MLC Jeevan Reddy: హోంగార్డుల వేతనం పెంచాలి: జీవన్ రెడ్డి
Read Latest Telangana News and Telugu News
Updated Date - Dec 22 , 2024 | 02:09 PM