AP NEWS: ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్.. వైసీపీ అనుకూల డీఎస్పీల తొలగింపు
ABN, Publish Date - Dec 09 , 2024 | 08:12 AM
ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై నియమించిన సిట్‌లో వైసీపీ సానుకూల డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
అమరావతి: ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై నియమించిన సిట్‌లో వైసీపీ సానుకూల డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వారిపై దర్యాప్తు చేయిస్తే స్మగ్లింగ్ కేసులో నిజాలు బయటకు రావని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూటమి ఎమ్మెల్యేలు నేరుగా ఫిర్యాదు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీతో అంటకాగిన డీఎస్పీలను వీఆర్‌కు పంపించింది. వీఆర్‌లో ఉన్న ముగ్గురిని ప్రభుత్వం సిట్‌లో నియమించింది. ఈ విషయంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి. దీంతో డీఎస్పీలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పోర్టు కేంద్రంగా జరుగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణానే ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌పై విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీ సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 1066 కేసులు నమోదు చేశామని అన్నారు. దీని ద్వారా 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. సీజ్ చేసిన బియ్యం విలువ బహిరంగ మార్కెట్లలో సుమారుగా రూ. 243 కోట్లు ఉంటుందని తెలిపారు. కాకినాడలో జరిగిన సంఘటనపై, రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులు, స్మగ్లింగ్‌పై తాము నమోదు చేసిన కేసులపై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీసీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 09 , 2024 | 08:13 AM