Anant Ambani: 2న రాష్ట్రానికి అనంత్ అంబానీ
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:05 AM
రిలయన్స్ ఎనర్జీ విభాగం వ్యాపార వ్యవహారాలను చూస్తున్న అనంత్ అంబానీ ఏప్రిల్ 2న ఏపీకి రానున్నారు. రాష్ట్రంలో రూ.65,000 కోట్లతో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సంస్థ మూడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించనుంది.

లోకేశ్‌తో కలసి కనిగిరిలో సీబీజీ ప్లాంట్‌కు శంకుస్థాపన
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రిలయన్స్ సంస్థల ఎనర్జీ విభాగంలో వ్యాపార వ్యవహారాలను చూస్తున్న అనంత్ అంబానీ ఏప్రిల్ 2న రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో రూ.65,000 కోట్ల పెట్టుబడితో ప్రకాశం, కడప, శ్రీసత్యసా యి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కంప్రెస్డ్ బయో గ్యాస్ సీబీజీ)ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో రిలయన్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు రాష్ట్రంలో ఐదేళ్లలో 11,000 మెట్రిక్ టన్నుల సీబీజీని ఉత్పత్తి చేస్తామని, మూడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రిలయన్స్ స్పష్టం చేసిం ది. ఒప్పందంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పరిధిలో రూ.139 కోట్లతో రిలయన్స్ ప్లాంటును నిర్మిస్తోంది. ఈ సీబీజీ ప్లాంటుకు రాష్ట్ర మంత్రి లోకేశ్‌లో కలసి ఏప్రిల్ 2న అనంత్ అంబానీ శంకుస్థాపన చేస్తారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..