Share News

Pat Cummings: వరుస ఓటములపై ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ స్పందన ఇదే

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:35 PM

టోర్నీ మొదట్లో రెండు మ్యాచులు ఓడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కొన్ని అంశాలు తాము మార్పులు చేస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయని అన్నాడు.

Pat Cummings: వరుస ఓటములపై ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ స్పందన ఇదే
Pat Cummings

వరుస ఓటములు ఎదుర్కున్నా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. ‘‘రెండు మ్యాచుల్లో ఓడినంత మాత్రాన ఆందోళన పడిపోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మెరుగైన ఆటతీరు కనబరుస్తాము. మాకున్న ప్రత్యామ్నాయాలు ఏంటో చూడాల్సి ఉంది. ఒకటి రెండు అంశాల్లో కాస్త భిన్నమైన పంథాను అనుసరిస్తే ఫలితాల్లో మార్పు కనిపిస్తుంది’’ అని అన్నాడు.

ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి చవి చూసింది. అంతకుముందు లఖ్నవూ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. అయితే, ఆదివారం నాటి మ్యాచ్ తరువాత మీడియాతో మాట్లాడిన పాట్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేశాడు.


Also Read: ఎవరీ అనికేత్ వర్మ.. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆదుకున్న ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ గురించి ఈ విషయాలు తెలుసా

‘‘స్థూలంగా చూస్తే తాము ఏం చేయగలమో మా టీం సభ్యులు చూపించారు. కాబట్టి, ఈ అంశంలో పెద్దగా మార్పులు ఏమీ ఉండకపోవచ్చు’’ అని పాట్ అన్నాడు. టాప్ ఆర్డర్‌ కాస్త తడబడిన విషయాన్ని కూడా అతడు అంగీకరించాడు. ‘అనుకున్న స్థాయిలో మేము రాణించలేదు. స్కోరు బోర్డును పరుగెలెట్టించలేదు. కొన్ని తప్పు షాట్స్, క్యాచులు ఉన్నాయి. అయితే ఈ ఫార్మాట్‌లో ఇవి సహజమే. ఇదేమీ పెద్ద మార్జిన్‌తో వచ్చిన ఓటమి కాదు. రెండు మూడు షాట్స్ పడి ఉంటే బాగుండేది. అయితే, గత రెండు మ్యాచుల్లో అనుకున్నవన్నీ జరగలేదు. పునఃపరిశీలన చేసుకుంటాము’’ అని అన్నాడు. అనికేత్ వర్మపై కూడా పాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. 74 పరుగులు సాధించిన అనికేత్ అందరినీ అబ్బుర పరిచిన విజయం తెలిసిందే.


Also Read: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది

ఇక ఎస్‌ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్‌ను మట్టికరిపించిన మిచ్ స్టార్క్ హైదరాబాద్ పతనాన్ని శాశించాడు. అయితే. తమ జట్టు విజయానికి ఉమ్మడి కృషే కారణమని స్టార్క్ పేర్కొన్నాడు. ‘ఆట విషయంలో ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేన్నీ లైట్ తీసుకోవడానికి లేదు. ఇక్కడ పది టీములు రెడీగా ఉన్నాయి. మేము మా ప్రణాళికలు వాటి అమలుపైనే దృష్టి పెట్టాలి. ఈ విషయంలో మేము నేడు విజయం సాధించాము’’ అని స్టార్క్ అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2025 | 10:35 PM