భక్తులతో కిటకిటలాడిన మోదకొండమ్మ ఆలయం
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:36 PM
విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం స్థానిక మోదకొండమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

పాడేరురూరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం స్థానిక మోదకొండమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 6 గంటల నుంచే వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యశర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు ఉదయం 11 గంటల వరకు అమ్మవారి ప్రసాదం, మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాదాన్ని అందించారు.