Sunday ఘనంగా మట్టల ఆదివారం
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:53 PM
గుడ్‌ఫ్రైడే ఈస్టర్ పండుగలకు ముందు ఆనవాయితీగా జరుపుకునే మట్టల ఆదివారాన్ని క్రైస్తవులు ఘనం గా జరుపుకున్నారు.

పుట్టపర్తిరూరల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): గుడ్‌ఫ్రైడే ఈస్టర్ పండుగలకు ముందు ఆనవాయితీగా జరుపుకునే మట్టల ఆదివారాన్ని క్రైస్తవులు ఘనం గా జరుపుకున్నారు. మండల వ్యాప్తంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం ఈత కొబ్బరి మట్టలు చేభూని ఆయా గ్రామాల్లో ఊరేగింపులు జరిపారు. మండలంలోని కర్ణాటకనాగేపల్లి కింగ్స్ చర్చి, వెంగళమ్మచెరువలోని హోలీసీటీ చర్చిల్లో ఫాదర్లు అరుణ్, మైకేల్ ఆధ్వర్యంలో ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఊరేగింపులు చేపట్టారు.