NYK: అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:02 AM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని నెహ్రూ యువకేంద్రం అధికారులు పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో యువతకు క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.

అనంతపురం క్లాక్‌టవర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని నెహ్రూ యువకేంద్రం అధికారులు పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో యువతకు క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువకేంద్రం అ ధికారులు మాట్లాడుతూ... అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని తె లి పారు. బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ ప్రసాదించిన రాజ్యాంగం ప్రతిఫలాలు అందిస్తోందన్నారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, భారత రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేశారు. క్విజ్, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎనవైకే ప్రోగ్రాం ఇనచార్జి శ్రీనివాసులు, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు భరత, శివకుమార్, సెంట్రల్ యూనివర్శిటీ ఆచార్యులు ప్రణతి, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు జీవనకుమార్, జయమారుతి, యువ నాయకులు రాజశేఖర్ గౌడ్, ప్రగతిపథం యూత అసోసియేషన కార్యదర్శి పవన, జాతీయ యువ కార్యకర్తలు, యువతీ, యువకులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....