MLA : ఇళ్ల నుంచే స్వచ్ఛత మొదలవ్వాలి
ABN , Publish Date - Jan 19 , 2025 | 01:09 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా స్వచ్చాంధ్రప్రదేశను చూడాలం టే మన ఇళ్లు, మన వీధుల నుంచే పరిశుభ్రత ప్రారంభం కావా లని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం రామగిరిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో అఽమె అధికారు ల తో కలిసి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా స్వచ్చాంధ్రప్రదేశను చూడాలం టే మన ఇళ్లు, మన వీధుల నుంచే పరిశుభ్రత ప్రారంభం కావా లని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం రామగిరిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో అఽమె అధికారు ల తో కలిసి పాల్గొన్నారు. ముందుగా అందరితో స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివాస్‌పై ప్రతిజ్ఞ చేయించారు. ఆమె స్వయంగా చీపురు పట్టి చెత్తను ఊడ్చుతూ పారిశుధ్యకార్మికుల్లో ఉత్సహాన్నినింపారు. ఎత్త ను తరలించే వాహనాన్ని తోలారు. అనంతరం పారిశుధ్య కార్మికు లకు చీరలు పంపిణీచేశారు. ప్రతినెలా మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....