Share News

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం

ABN , Publish Date - Feb 11 , 2025 | 12:05 AM

మండలంలోని హేమావతి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి తాగునీటి బోరును, సీసీ రోడ్డు, గోకులంషెడ్డులను ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు.

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం
MLA MS Raju, Gundumala inaugurating the Gokulam shed in Hemavathi

అమరాపురం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హేమావతి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి తాగునీటి బోరును, సీసీ రోడ్డు, గోకులంషెడ్డులను ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గోకులం షెడ్లను రాయితీతో ఇస్తోందని వారు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, ఎంపీడీఓ రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ మనూనాయక్‌, ఏఈ హరీష్‌, మండల కన్వీనర్‌ గణేష్‌, ఎస్సీ సెల్‌ జయకుమార్‌, మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, రామచంద్రప్ప, కుమారస్వామి, మారుతీప్రసాద్‌, శివరుద్రప్ప, సర్పంచి తిప్పేస్వామి, జడ్పీటీసీ స్వారక్క, దాదాపీర్‌ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: హేమావతి గ్రామంలో 26వతేదీన నిర్వహించే హెంజేరు సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే, టీటీడీ పా లకమండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు ఆదేశించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి హేమావతి గ్రామంలో సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వారు గ్రామస్థులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Updated Date - Feb 11 , 2025 | 12:06 AM

News Hub