MLA : అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 02 , 2025 | 01:04 AM
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ రూ.3. 22లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మం డలంలోని రుద్రంపేట పంచాయతీలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులతో కలసి ఆయన శనివారం ఎన్టీఆర్ సామాజిక భద్రత ఫించన్లు పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం రూరల్, మార్చి1(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ రూ.3. 22లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మం డలంలోని రుద్రంపేట పంచాయతీలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులతో కలసి ఆయన శనివారం ఎన్టీఆర్ సామాజిక భద్రత ఫించన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఫింఛనదారులనడి వారి స్పందన తెలుసుకు న్నారు. అనంతరం చంద్రబాబుకొట్టాల్లో ఎమ్మెల్యే సొంత నిధులతో ఏ ర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను వారు ప్రా రంభించారు. బీసీ కార్పొరేషన డైరెక్టర్లు పరమేష్, పీఎల్‌ఎనమూర్తి, కొండన్న, నగర ప్రధాన కార్యదర్శి ముక్తియార్, రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, నాయకులు రమేష్, భక్తవత్సలం నాయుడు, మారుతి నాయు డు, ఎస్‌ఎం బాష, ఈడిగ నాగభూషణం, ఖాసిం, పెద్దన్న, బాలప్ప, గోపాల్ గౌడ్, కదిరప్ప, రాయల్ మధు, వెంకటరాముడు, అంజి, జయ రామ్‌నాయక్, పోతలయ్య, ఆది, సైపుద్దీన, ఇస్మాయిల్, ఓంకార్‌రెడ్డి, మధు, తెలుగుమహిళలు స్వప్న, సంగా తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....