PALLE RAGHUNATHA REDDY: ఢిల్లీ ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు: మాజీ మంత్రి
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:08 AM
అభివృద్ధి చేసే బీజేపీకే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని మాజీమంత్రి పల్లెరఘునాథరెడ్డి అన్నారు.

పుట్టపర్తిరూరల్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి చేసే బీజేపీకే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని మాజీమంత్రి పల్లెరఘునాథరెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యేక్యాంపుకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూట మి ప్రదానమంత్రి నరేంద్రమోదీ పాలనపై ప్రజలు ఎంతో నమ్మకముంచి అత్యదిక స్థానాలను అందించిన ఢిల్లీప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడం సంతోషదాయకమన్నారు.
సంబరాలు: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ అఖండ విజయంపై కూటమినేతలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ప్రచారం నిర్వహించిన స్థానాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణ్, కొండమరాజు,రాజారెడ్డి, లాయర్ హరికృష్ణ, జ్యోతిప్రసాద్, బాలగంగాదర్, సురేంద్రబాబు, రామాంజినేయులు, తెలుగుదేశంపార్టీ నాయకులు సామకోటి ఆదినారాయణ, మునిసిపల్ మాజీచైర్మన బెస్తచలపతి, బేకరినాయుడు, జనసేన నాయకులు బొగ్గరం శ్రీనివాసులు, రాము, మారుతి పాల్గొన్నారు.
ధర్మవరం: 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు అన్నారు. పార్టీ గెలుపుపై స్థానిక ఎన్టీఆర్ సర్కిల్‌లో సంబరాలు జరుపుకుని స్వీట్లను పంచిపెట్టారు. నాయకులు జింకాచంద్ర, గొట్లూరు చంద్ర, సాకే ఓబుళేశు, గుండా పుల్లయ్య, శ్యామరావు, డోలా రాజారెడ్డి, జమీర్ అహమ్మద్, నబీరసూల్, భక్తవత్సలం పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు: ఢిల్లీ ఎన్నిల్లో బీజేపీ మెజార్టీ సాధించడం పట్ల శనివారం మండలకేంద్రలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు వీరాంజి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చి, మిఠాలు పంచిపెట్టారు. శరతకుమార్‌రెడ్డి, అశ్వత్థప్ప, రంగారెడ్డి, సురేష్, నాగప్ప, క్రిష్టప్ప, సురేంద్రరెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.