FESTIVAL: రాములోరి పండుగకు సిద్ధం
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:24 AM
హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని రామమందిరాలన్నీ భక్తజనకోటితో కిటకిటలాడనున్నాయి. ఇప్పటికే రామాల యాలు విద్యుద్దీపాలంకరణతో ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆలయాలవద్ద అవసరం మేరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని రామమందిరాలన్నీ భక్తజనకోటితో కిటకిటలాడనున్నాయి. ఇప్పటికే రామాల యాలు విద్యుద్దీపాలంకరణతో ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆలయాలవద్ద అవసరం మేరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వందలాదిమంది రాములవారి నగరో త్సవంతో పాటు మెగా బైక్‌ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే మొదటి రోడ్డు లోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఆదివారం నుంచి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఇక ఆజాద్‌నగర్‌లోని దత్త మందిరం, విద్యుత్‌నగర్ కాలనీలోని పంచముఖాంజనేయస్వామి దేవాల యం, లక్ష్మీనగర్ రామాలయం, శ్రీనివాసనగర్ రామాంజనేయ ఆలయం, వే ణుగోపాల్ నగర్ సద్గురు సాయినాథ మందిరం, విద్యారణ్యనగర్, మారుతీ నగర్ రామాలయాలు పాతూరు రామస్వామి గుడి, రెవెన్యూ కాలనీ, అంబే డ్కర్ నగర్, బుడ్డప్పనగర్ రామాలయాలు, పాతూరు వాసవీ కన్యకాపర మేశ్వరి ఆలయంతో పాటు అన్ని ప్రాంతాల్లోని రామాలయాల్లో ప్రత్యేక విశేష పూజలు, కల్యాణోత్సవాలు, ఉట్లమానుపరుషలు నిర్వహించనున్నారు.
చెన్నేకొత్తపల్లి: శ్రీరామనవమిపండుగను పురస్కరించుకుని మం డలంలోని రామాల యాలు ముస్తాబ య్యా యి. ఆధివారం ఉద యం అభిషేకాలు, కల్యా ణోత్సవాలు నిర్వహిం చడానికి ఏర్పాట్లు చేశా రు. ముఖ్యంగా చెన్నే కొత్తపల్లిలో ఉదయం 10గంటలకు రాములోరి కల్యాణోత్సవం నిర్వ హించనున్నట్లు ఆయా ఆలయ నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....