TRIBUTE TO PARITALA RAVI : పరిటాల రవీంద్రకు ఘన నివాళి
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:16 AM
నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతిని నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌లు పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతపురం అర్బన, జనవరి 24(ఆంధ్రజ్యోతి): నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతిని నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌లు పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం సుబ్రహ్మణ్యం, ఆలం నరసానాయుడు, తలారి ఆదినారాయణ, గౌస్‌మొద్దీన, రాయల్ మురళీ, ముంటిమడుగు కేశవరెడ్డి, గంగారామ్, సరిపూటి రమణ, సుధాకర్ యాదవ్, కూచి హరి, స్వామిదాస్, సంగా తేజశ్విని, ఇస్మాయిల్, కృష్ణకుమార్, మణికంఠ బాబు, లింగారెడ్డి, నెట్టెం బాలకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంరూరల్: మాజీ మంత్రి పరిటాల వర్ధంతిని పురస్కరించుకుని వెంకటాపురంలో ఆయన ఘూట్‌కు రాప్తాడు నియోజకవర్గం తెలుగురైతు అధ్యక్షులు మారినేని నారాయణస్వామి నివాళి అర్పించారు. ఆయన వెంట వెంకటరాముడు, సజ్జల కాలువరాము, డా.బీఆర్ అంబేడ్కర్ కురుగుంట గురుకుల కళాశాల చైర్మన మన్నల తిరుపాలు, ధర్మేంద్ర, బ్రహ్మ ఉన్నారు.
సిండికేట్ నగర్‌లో జింకాసూర్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్, మండల ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు, పరిటాల రవీంద్ర విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
రాప్తాడు: పరిటాల రవీంద్ర వర్ధంతిని మండల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో స్వర్టీయ ఎన్టీఆర్, రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. మండల కన్వీనర్ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నారాయణస్వామి పాల్గొన్నారు.
చెన్నేకొత్తపల్లి: దివంగత పరిటాల రవీంద్ర 20వ వర్ధంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ ముత్యాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాడెంసూర్యనారాయణరెడ్డి, చెన్నకేశవులగౌడ్, హరినాథరెడ్డి పాల్గొన్నారు.
రామగిరి:మండలంలోని శ్రీహరిపురంలో పరిటాల రవీంద్ర విగ్రహానికి పూలమాలవేసి గ్రామస్థులు నివాళి నివాళులర్పించారు. టీడీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
ఫ కనగానపల్లి: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతిని టీడీపీ నాయకులు, ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. పరిటాల భవనలో రవీంద్ర చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. నెట్టెం వెంకటేష్, యాతం పోతలయ్య, సుధాకర్‌చౌదరి, ముకుందనాయుడు, సురే్‌షచౌదరి పాల్గొన్నారు.
ఫ నార్పల: మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో పరిటాల రవీంద్ర 20వ వర్థంతిని శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచారు. సాగునీటిసంఘం అధ్యక్షుడు ఆలం నాగార్జున నాయుడు, ఎర్రినాగప్ప, లక్ష్మీనారాయణ, చంద్రబాబు, పాల్గొన్నారు.
ఫ ఆత్మకూరు: మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పరిటాల రవీంద్ర వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శ్రీనివాసులు, శశాంక చౌదరి, మనోరంజన, వేణుగోపాల్ పాల్గొన్నారు.