Share News

Andhra Pradesh Clean Energy:ఇంధన రంగంలో సంస్కరణలు

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:31 AM

2047 నాటికి నెట్-జీరో లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎస్‌ విజయానంద్‌ నీతి ఆయోగ్‌ ప్రతినిధులతో వివరించారు. 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Andhra Pradesh Clean Energy:ఇంధన రంగంలో సంస్కరణలు

సీఎ్‌స విజయానంద్‌తో నీతి ఆయోగ్‌ బృందం చర్చ

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఇంధన రంగంలో తీసుకురానున్న సంస్కరణలను నీతి ఆయోగ్‌ ప్రతినిధి బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కె. విజయానంద్‌ వివరించారు. విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన భేటీలో ఖర్చు తగ్గించడంతోపాటు సమర్థవంతమైన ఇంధన పరివర్తన కోసం వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. 2047 నాటికి రాష్ట్రంలో నికర సున్నా లక్ష్యాలను(నెట్‌జీరో టార్గెట్స్‌) సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ‘2024-ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ’ కింద 160 గిగావాట్లకు మించి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. దానిలో భాగంగా సౌర, పవన విద్యుదుత్పత్తి, గ్రీన్‌ హైడ్రోజన్‌ విద్యుత్‌ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి పలు ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఖర్చు-సమర్థ ఇంధన పరివర్తనను సాధించడంలో ఏపీకి మద్దతు ఇవ్వడానికి నీతి ఆయోగ్‌ ముందుకు వచ్చింది. అదేవిధంగా 2027 నాటికి రాష్ట్రం నెట్‌ జీరో లక్ష్య సాధనకు చేరుకోవడానికి వీలుగా మద్దతు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు నీతి ఆయోగ్‌ బృందం అంగీకరించింది.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 05:31 AM