Share News

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి షాక్.. రిమాండ్ పొడిగింపు

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:19 PM

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. విజయవాడ ఏజేఎఫ్‌సీఎం కోర్టు రిమాండ్ పొడిగించింది.

 Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి షాక్.. రిమాండ్ పొడిగింపు
Vallabhaneni Vamsi

విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ AJFCM కోర్టు ఇవాళ(మంగళవారం) రిమాండ్ పొడిగించింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు‌స్టేషన్‌లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది. 15-04- 2025 వరకు వంశీకి రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ AJFCM కోర్టు ఆదేశాలు ఇచ్చింది.


సీఐడీ కస్టడీకి వంశీ అనుచరుడు..

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు (A1) మోహన్ రంగాను సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి మోహన్ రంగా వెళ్లారు. ఇటీవల రంగాను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ విజయవాడ AJFCM కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 05:22 PM