Kakani Bail Petition: కాకాణి బెయిల్ పిటిషన్‌పై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:29 PM
Kakani Bail Petition: అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాకాణిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

అమరావతి, ఏప్రిల్ 1: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో (AP High Court) ఈరోజు (మంగళవారం) విచారణ జరిగింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కాకాణి తరపు న్యాయవాదులు వాదించారు. ఆయనపై పెట్టిన కేసులు కూడా అంత తీవ్రమైనవి కాదని వాదనలు వినిపించారు. అయితే కాకాణిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదైందని కోర్టుకు వివరించారు ప్రభుత్వ న్యాయవాది. ఎస్సీ, ఎస్టీ కేసు వివరాలను పిటీషనర్‌కు ఇవ్వడంతో పాటు, కోర్టు ముందు కూడా ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ దశలో ఎస్సీ, ఎస్టీ కేసులో కాకాణిని అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల ఎల్లుండి వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు.
అయితే ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వకూడదని గతంలో ఇదే కోర్టు ఆదేశించిందని.. అందువల్ల అటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. కాకాణికి రెండుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని.. విచారణకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాది తీసుకొచ్చారు. కేసు విచారణను ఎల్లుండికి (ఏప్రిల్ 3)కు హైకోర్టు వాయిదా వేసింది. ఎల్లుండి కేసును పూర్తి స్థాయిలో విచారిస్తామని న్యాయమూర్తి ఇరుపక్షాల న్యాయవాదాలుకు స్పష్టం చేశారు.
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
కాగా.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకాణి సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. వారికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక కాకాణితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే కాకాణికి పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. మొదటి సారి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా కాకాణి లేకపోవడంతో గేటుకు నోటీసును అతికించి వెళ్లారు పోలీసులు. అయితే పోలీసులు వెళ్లిన కాసేపటికే తాను ఎక్కడికీ వెళ్లలేదని హైదరాబాద్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉగాది పండుగను జరుపుకున్నట్లు కొన్ని ఫోటోలను కాకాణి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వెంటనే పోలీసులు హైదరాబాద్‌లోని కాకాణి ఇంటికి వెళ్లారు. కానీ అప్పుడు కూడా మాజీ మంత్రి అక్కడ లేకపోవడంతో ఆయన సమీప బంధువుకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈరోజు ఉదయం నుంచి కాకాణి.. పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు పోలీసుల విచారణకు మాజీ మంత్రి డుమ్మా కొట్టారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం ఇచ్చారు కాకాణి. రేపు (బుధవారం) కుటుంబ శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని ఆయన చెప్పారు. దీంతో మరోసారి కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.
ఇవి కూడా చదవండి
Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
HCU Land Politics:హెచ్‌సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ
Read Latest AP News And Telugu News