Share News

మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొన్న ఆటోడ్రైవర్‌

ABN , Publish Date - Apr 01 , 2025 | 08:29 PM

మద్యం మత్తులో ఆటోను డ్రైవర్‌ డివైడర్‌కు ఢీకొనడంతో వాహనం బోల్తా పడడంతో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.

మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొన్న ఆటోడ్రైవర్‌

వాహనం బోల్తా పడడంతో ఐదుగురు విద్యార్థులకు గాయాలు

గాజువాక, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఆటోను డ్రైవర్‌ డివైడర్‌కు ఢీకొనడంతో వాహనం బోల్తా పడడంతో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గాజువాక చైతన్యనగర్‌లో గల వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మింది నుంచి ఎర్రునాయుడు అనే వ్యక్తికి చెందిన ఆటోలో మంగళవారం మధ్యాహ్నం ఇళ్లకు బయలుదేరారు. గాజువాక సబ్‌ స్టేషన్‌ సర్వీసు రోడ్డు వద్దకు రాగానే ఆటోను డ్రైవర్‌ వేగంగా నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని వాహనం బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సీహెచ్‌ భార్గవ్‌ (7), సీహెచ్‌ భువనదీప్‌ (11), సీహెచ్‌ నిమిషా (13), కె.సాహితి (14), అభిరాం (12)కు గాయాలయ్యాయి. మోనికా అనే విద్యార్థినికి గాయాలు కాలేదు. స్థానికులు ఆటోలో ఇరుక్కున్న విద్యార్థులను బయటకు తీసి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకుని వెళ్లారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ ఏసీపీ వాసుదేవ్‌, సీఐ కోటేశ్వరరావులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన విద్యార్థులను పరామర్శించారు. ఆటో డ్రైవర్‌ ఎర్రినాయుడిని అదుపులోకి తీసుకుని డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయగా 550 పాయింట్ల రీడింగ్‌ నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 01 , 2025 | 08:29 PM