Minister Pemmasani: వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది..పెమ్మసాని ఫైర్
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:37 PM
Minister Pemmasani Chandra Sekhar: పీవీకే నాయుడు మార్కెట్‌లో వ్యాపారులు ఆందోళన చెందవద్దని వారికి అండగా ఉంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాటిచ్చారు. త్వరగా కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.

గుంటూరు జిల్లా: వైసీపీ ప్రభుత్వం పీవీకే నాయుడు మార్కెట్ నిర్మాణం చేస్తామని చెప్పి వ్యాపారులను మోసం చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు. ఇవాళ(ఆదివారం) పీవీకే నాయుడు మార్కెట్‌ను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు.
ALSO READ: AP News: టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా..: కనపర్తి శ్రీనివాసరావు
మార్కెట్లో వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి పెమ్మసాని తెలుసుకున్నారు. త్వరలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తామని మాటిచ్చారు. కొత్తగా నిర్మించే మార్కెట్ కాంప్లెక్స్‌లో సుమారు 375 షాపులు తమకు కేటాయించాలని వ్యాపారులు కోరారు. క్రింది భాగంలోని రెండు అంతస్తులు తమకు కేటాయించాలని వ్యాపారులు మంత్రి పెమ్మసానిని కోరారు. తప్పనిసరిగా వారి సమస్యలను కార్పొరేషన్ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ALSO READ: Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
యుద్ద ప్రాతిపదికన మార్కెట్ పనులు: ఎమ్మెల్యే మాధవి
గత 40 ఏళ్లుగా పీవీకే నాయుడు మార్కెట్‌లో వ్యాపారులు కూగాయల వ్యాపారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. ఈ మార్కెట్ పూర్తిగా దెబ్బతిని కూలే పరిస్థితిలో ఉందని చెప్పారు. నడిబొడ్డున ఉన్న ఈ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తే నగరానికి తలమానికంగా ఉంటుందని అన్నారు. నగరంలో నాలుగు చోట్ల కూరగాయల వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని తెలిపారు. నూతన మార్కెట్ బిల్డింగ్ నిర్మించేవరకు వారికి కేటాయించిన చోట్ల వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు. యుద్ద ప్రాతిపదికన పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: పొట్టి శ్రీరాములు జయంతి వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
For More AP News and Telugu News