‘అమరజీవి’కి ఘన నివాళి
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:42 AM
ఆంధ్రరాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జరిగాయి.

తిరుపతి(కలెక్టరేట్), మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఆంధ్రరాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జరిగాయి. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు మార్గం అనుసరణీయమన్నారు. ఇన్‌ఛార్జి డీఆర్వో దేవేంద్రరెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ, సాధికార అధికారణి జ్యోత్స్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.