జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:51 AM
జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అనుమానిత ప్రాంతాలు, కాలనీల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తిరుపతి వెస్ట్ సీఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఇందిరానగర్, ఎన్టీఆర్ సర్కిల్, తదితర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు.

137 వాహనాల తనిఖీ.. 34 సీజ్
తిరుపతి(నేరవిభాగం), మార్చి 16(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అనుమానిత ప్రాంతాలు, కాలనీల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తిరుపతి వెస్ట్ సీఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఇందిరానగర్, ఎన్టీఆర్ సర్కిల్, తదితర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. ఇందిరానగర్‌లో పోలీసులు ఇంటింటికీ వెళ్లి వారి అడ్రస్సులు, ఆధార్ కార్డులు పరిశీలించారు. 58 వాహనాలు తనిఖీ చేసి ఎలాంటి రికార్డులు లేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. శ్రీకాళహస్తి టూ టౌన్ పరిధిలో వీఎంపల్లెలో 32 వాహనాలు తనిఖీ చేసి నాలుగు సీజ్ చేశారు. పుత్తూరు పరిధిలోని ముద్దుకృష్ణపురంలో 32 వాహనాలు.. నాగలాపురంలోని దొడ్డిమెట్ట ఎస్టీ కాలనీలో 15 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు సీఐ సురేంద్ర నాయుడు, సీఐలు ఓబయ్య, వెంకటేశ్వర్లు, సునిల్‌కుమార్, నాగలాపురం ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.