Share News

YS Jagan: తిరుపతికి జగన్.. బాధితులకు పరామర్శ

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:10 PM

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం తిరుపతికి వైఎస్ జగన్ రానున్నారు.

YS Jagan: తిరుపతికి జగన్.. బాధితులకు పరామర్శ
Former CM YS Jaganmohan Reddy

అమరావతి, జనవరి 9: తిరుపతిలో తొక్కిసలాట (Tirupati Stamped) ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలియజేశారు. అలాగే మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu naidu) కూడా తిరుపతికి చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ (Former CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం తిరుపతికి వైఎస్ జగన్ రానున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను మాజీ సీఎం పరామర్శించనున్నారు. జగన్ తిరుపతి రాబోతున్న విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కాగా.. వైకుంఠ ఏకదాశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద గత అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. మొత్తం మూడు కేంద్రాల వద్ద తొక్కిసలాటలో పరిస్థితి విషమంగా మారింది. మొత్తం ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడగా రియా, స్విమ్స్ ఆస్పతులలో చికిత్స పొందుతున్నారు.


అలాగే మృతదేహాలను పోస్టు మార్టం పూర్తి అవడంతో ప్రత్యేక అంబులెన్స్‌లలో వారి వారి స్వస్థలాలకు తరలించారు. అలాగే రుయా ఆస్పత్రి వద్ద మృతుల కుటుంసభ్యులను హోంమంత్రి అనిత, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రులు వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారిని మెరుగైన వైద్య సేవలను అందజేస్తామని మంత్రులు తెలిపారు.


తిరుపతికి బయలుదేరిన సీఎం

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి బయలుదేరారు. తిరుపతి ఘటనలో గాయడిపన వారిని పరామర్శించేందుకు కాసేపటి క్రితమే సీఎం పయనమయ్యారు. అంతుకుముందు సీఎంవో అధికారులు చంద్రబాబు సమావేశమయ్యారు. తిరుపతిలో తాజా పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. ఇప్పటికే తొక్కిసలాట ఘటనపై ఓ నివేదిక సీఎంకు చేరింది. తాజా పరిణామాలు, ఎవరి వల్ల తప్పిదం జరిగిందనే అంశంపై చర్చ జరిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుపతికి బయలుదేరి వెళ్లారు.


ఇవి కూడా చదవండి...

TTD EO: తిరుపతిలో తొక్కిలాటపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..

Tirupati Stamped: తిరుపతి ఘటన మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సర్కార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 09 , 2025 | 01:19 PM