Share News

రాజకీయాలే మా కొంప ముంచేశాయి!

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:38 AM

‘‘మా గ్రామంలో వైసీపీని ఎదిరించి మొదట టీడీపీ జెండా కట్టింది మా నాన్న.. టీడీపీ గెలవడంతో కేక్‌ కట్‌ చేస్తుంటే బైక్‌పై వచ్చి మా అమ్మ కాళ్లు విరగ్గొట్టారు.. చంద్రబాబు జన్మదిన వేడుకలు చేస్తుంటే మా అన్న చెయ్యి ఇరగ్గొట్టారు.. ఇప్పుడు ఏకంగా కొడవలితో దాడి చేసి నా చేతికి గాయం చేశారు.. అడ్డు వచ్చిన మానాన్నను కొడవలితో నరికి చంపేశారు.. రాజకీయాలే మాకొంప ముంచాయి దేవుడా’’ అంటూ రామకృష్ణ కొడుకు సురేష్‌ రోదించడం చూపరులను కలచివేసింది.

రాజకీయాలే మా కొంప ముంచేశాయి!
రామకృష్ణ మృతదేహాన్ని పరిశీలిస్తున్న శ్రీరాం చినబాబు - వైసీపీ కార్యకర్త కొడవలితో దాడి చేసిన సంఘటనలో గాయపడిన రామకృష్ణ కుమారుడు సురే్‌ష

మదనపల్లె అర్బన్‌/పుంగనూరు, ఆంధ్రజ్యోతి: ‘‘మా గ్రామంలో వైసీపీని ఎదిరించి మొదట టీడీపీ జెండా కట్టింది మా నాన్న.. టీడీపీ గెలవడంతో కేక్‌ కట్‌ చేస్తుంటే బైక్‌పై వచ్చి మా అమ్మ కాళ్లు విరగ్గొట్టారు.. చంద్రబాబు జన్మదిన వేడుకలు చేస్తుంటే మా అన్న చెయ్యి ఇరగ్గొట్టారు.. ఇప్పుడు ఏకంగా కొడవలితో దాడి చేసి నా చేతికి గాయం చేశారు.. అడ్డు వచ్చిన మానాన్నను కొడవలితో నరికి చంపేశారు.. రాజకీయాలే మాకొంప ముంచాయి దేవుడా’’ అంటూ రామకృష్ణ కొడుకు సురేష్‌ రోదించడం చూపరులను కలచివేసింది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిందన్న ఆనందంతో టపాసులు కాల్చడమే తమ కుటుంబంపై దాడులు చేయడానికి కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటరమణ కొడవలి దాడిలో తీవ్రంగా గాయపడ్డ రామకృష్ణను, ఆయన కుమారుడు సురేష్‌ను వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ డాక్టర్లు సురే్‌షకుమార్‌కు చికిత్స చేశారు. రామకృష్ణను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేయగా కలికిరి సమీపంలో వెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. శవ పంచనామా కోసం మదనపల్లె ఆస్పత్రికి రామకృష్ణ మృతదేహాన్ని తరలించి మార్చురీలో ఉంచారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు వందలాదిమంది ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో రామకృష్ణ మృతదేహాన్ని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, దొరస్వామినాయుడు సందర్శించారు. మృతుడు రామకృష్ణ భార్య ఉమాదేవిని, కుమారులు సురే్‌షకుమార్‌, శివలను పరామర్శించారు. హోం మంత్రితో బాధిత కుటుంబీకులను ఫోన్లో మాట్లాడించారు. ఆమె వారిని పరామర్శించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుడి భార్య ఉమాదేవి, కుమారుడు సురేష్‌ మాట్లాడుతూ రాజకీయాలే తమ కొంప ముంచాయన్నారు.తమకు ఎప్పుడూ న్యాయం జరగలేదని ఆవేదన చెందారు.తమపై గతంలో జరిగిన దాడులకు సంబంధించి పుంగనూరు స్టేషన్‌లో కేసులు పెట్టినా, ఏ కేసులో కూడా న్యాయం జరగలేదని వాపోయారు.చివరకు కుటుంబ పెద్దను పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబంపై దాడి చేసిన ప్రతి సారీ సర్పంచ్‌, ఎంపీటీసీలు పుంగనూరు స్టేషన్‌కు చేరుకుని గంటల వ్యవధిలోనే నిందితులను బయటకు తెస్తున్నారని చెప్పారు.

Updated Date - Mar 16 , 2025 | 01:38 AM