Share News

శిలాతోరణం సర్కిల్‌ దాకా క్యూలైన్‌

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:41 AM

తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది

శిలాతోరణం సర్కిల్‌ దాకా క్యూలైన్‌
సర్వదర్శనం క్యూలో భక్తులు

తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు రాగా.. శనివారం 72,923 మంది స్వామిని దర్శించుకోగా, 35,571 మంది తలనీలాలు సమర్పించారు.

- ఆంధ్రజ్యోతి, తిరుమల

Updated Date - Apr 14 , 2025 | 12:41 AM