వైభవంగా చౌడేశ్వరీదేవి జ్యోతి ఉత్సవాలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:55 PM
మండంలోని ప్రముఖ శక్తిక్షేత్రమైన నందవరం చౌడేశ్వరీమాత ఉత్సవాల సందర్భంగా జ్యోతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కామేశ్వరమ్మ తెలిపారు. ఆలయ మాజీ చైర్మన పీవీ కుమార్‌రెడ్డి, గ్రామ పెద్దల ఆఽధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

బనగానపల్లె, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మండంలోని ప్రముఖ శక్తిక్షేత్రమైన నందవరం చౌడేశ్వరీమాత ఉత్సవాల సందర్భంగా జ్యోతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కామేశ్వరమ్మ తెలిపారు. ఆలయ మాజీ చైర్మన పీవీ కుమార్‌రెడ్డి, గ్రామ పెద్దల ఆఽధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు చౌడేశ్వరీమాతకు ఉదయం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, పసుపు కుంకుమ, పట్టువస్ర్తాల అలంకరణ, కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఏపీ నుంచే కాక తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతపురం ధర్మవరానికి చెందిన శ్రీ అభయహస్త సేవా సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి భాస్కరయ్య ఆచారిచే చౌడేశ్వరీ అమ్మవారికి దిష్టిచుక్క పెట్టిన అనంతరం అర్ధరాత్రి 1 గంట నుంచి నందవరం జ్యోతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. బనగానపల్లె, నందివర్గం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో భక్తులకు మజ్జిగ పాకెట్లు పంపిణీ చేశారు. ప్రతి 15 నిముషాలకు బనగానపల్లె మీదుగా కర్నూలు, అనంతపురం జిల్లాలనుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.
నందవరం చౌడేశ్వరిమాతను
దర్శించుకున్న మంత్రి సత్యకుమార్
బనగానపల్లె మండలంలోని ప్రముఖ శక్తిక్షేత్రమైన నందవరం చౌడేశ్వరీమాతను బుధవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కామేశ్వరమ్మ, ఆలయ మాజీ చైర్మన పీవీ కుమార్‌రెడ్డితో పాటు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నందవరం చౌడేశ్వరీమాత జ్యోతి ఉత్సవాలకు హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన చేయించారు. ఈ సందర్భంగా ఆలయ పెద్దలు, అర్చకులు మంత్రిని సత్కరించారు. మంత్రి వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణయాదవ్, బీవీ.సుబ్బారెడ్డి, లింగన్న, హరికృష్ణగౌడ్, యాదగిరి, రవికుమార్, లోకేశ్వర్‌రెడ్డి, చిన్నయ్యయాదవ్, బాలవెంకటేశ్వర్లు, శరతచంద్రకుమార్, చల్లా దామోదర్‌రెడ్డి, శ్రీరాములు, చిన్నమద్దిలేటి, శేషన్నయాదవ్, శ్రీనివాసులు, సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు.