Share News

CM Chandrababu: పథకాల్లో వివక్ష ఉండదు

ABN , Publish Date - Mar 15 , 2025 | 03:47 AM

దీనిని తిప్పికొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని, పార్టీలకతీతంగా పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

CM Chandrababu: పథకాల్లో వివక్ష ఉండదు

పార్టీలకతీతంగా సంక్షేమం: చంద్రబాబు

వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

సంక్షేమం వేరు.. రాజకీయ బంధాలు వేరు

వైసీపీ నేతలతో కలవొద్దు!

వారిని దరి చేరనివ్వొద్దు

ఇన్‌చార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లాల కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం అందించాలి. కార్యకర్తలు, నాయకులతో మమేకం కావాలి. జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలి.

మొదటిసారే పదవులు రాలేదని ఎవరూ అనుకోవద్దు, రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తాం. ఆ బాధ్యత నాది.

- చంద్రబాబు

ఇన్‌చార్జి మంత్రుల జిల్లా పర్యటనలు పెరగాలి

గ్రూపు రాజకీయాలకు తావివ్వొద్దు

మూడు పార్టీ నేతలనూ కలుపుకొని వెళ్లాలి

ఆ బాధ్యత ప్రజాప్రతినిధులే తీసుకోవాలి

నామినేటెడ్‌ పదవులపై కసరత్తు జరుగుతోంది

మొదటిసారే ఏమీ రాలేదని అనుకోవద్దు

అందరికీ అవకాశాలిచ్చే బాధ్యత నాది

పదవి పొందాక హుందాగా ఉండాలి: సీఎం

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలీ భేటీ

అమరావతి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మాట చెబితే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని తాను చెప్పినట్లుగా ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని తిప్పికొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని, పార్టీలకతీతంగా పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు వేరు.. రాజకీయపరమైన సంబంధాలు వేరన్నారు. వైసీపీ వారిని దరి చేరనివ్వొద్దని మరోసారి తేల్చిచెప్పారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు.


ఇన్‌చార్జి మంత్రులు జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత వారే తీసుకోవాలన్నారు. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎక్కడా గ్రూపు రాజకీయాలకు తావివ్వకూడదన్నారు. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంటులో తమ తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు. మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాలని.. ఈ బాధ్యతను ప్రజాప్రతినిధులే తీసుకోవాలన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

పదవుల కోసం పేర్లు పంపండి

నామినేటెడ్‌ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నాం. వాటికి పేర్లను సిఫారసు చేయకుండా కొంత మంది నేతలు ఆలస్యం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్‌ పదవుల కోసం అందించాలి. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాం. ఇప్పటివరకు నామినేటెడ్‌ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయి. అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రధాన దేవాయాలకు చైర్మన్లను నియమిస్తాం. పదవులు తీసుకోవడమే కాకుండా జరిగే ప్రతి ఎన్నికల్లో ప్రభావం చూపించాలి. పదవులు చేపట్టినవారి వారి ప్రతిభ, పనితీరును పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడూ అంతే జాగ్రత్తగా.. హుందాగా వ్యవహరించాలి. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలి.


ఒక్కో నియోజకవర్గంలో 10 వేల రూఫ్‌టా్‌పలు

సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహించడం మన ప్రభుత్వ విధానం. పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలి. 2 కిలోవాట్ల రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల సబ్సిడీని రాష్ట్రప్రభుత్వం తరఫున అదనంగా అందిస్తాం. కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి బీసీలకు రూ.80 వేల వరకు రాయితీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తాం. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల రూఫ్‌టా్‌పల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోవాలి.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 03:47 AM