Share News

ఈకే.. నాట్‌ ఓకే!

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:06 AM

కలెక్టరేట్‌(కాకినాడ), ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డుల్లో ఉన్న సభ్యుల వివరాలను ఈకే వైసీలో నమోదు చేసే క్రతువు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఇటు రేషన్‌డీలర్లు, ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది సహకరి ంచకపోవడంతో

ఈకే.. నాట్‌ ఓకే!

ఉమ్మడి ‘తూర్పు’లో నత్తనడకన ఈకేవైసీ నమోదు క్రతువు

ఈ నెలాఖరుతో గడువు పూర్తి

ఇప్పటివరకు 45.24 లక్షల మందికి పూర్తి

ఇంకా నమోదు కావాల్సినవారు 3లక్షల 23వేలమంది

సహకరించని సచివాలయాల సిబ్బంది, రేషన్‌డీలర్లు

కలెక్టరేట్‌(కాకినాడ), ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డుల్లో ఉన్న సభ్యుల వివరాలను ఈకే వైసీలో నమోదు చేసే క్రతువు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఇటు రేషన్‌డీలర్లు, ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది సహకరి ంచకపోవడంతో ఈ పోస్‌ ద్వారా నమోదు నెమ్మదించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో రేషన్‌కార్డుల్లో 49లక్షల34వేలమంది సభ్యులు ఉన్నా రు. వీరిలో ఇప్పటివరకు 45లక్షల 24వేల మంది వివరాలను ఈకేవైసీ చేశారు. ఇంకా 3 లక్షల23 వేలమంది రేషన్‌కార్డు సభ్యుల వివరాలను నమో దు చేయాల్సి ఉంది. రేషన్‌షాపు డీలర్లు, ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది సహకరిం చకపోవడం వల్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. దీనిలో ఐదేళ్లలోపు చిన్నా రులు, 80ఏళ్లు దాటిన వృద్ధులకు మినహాయింపు ఇచ్చారు. వీరి సం ఖ్య 86700 మంది ఉన్నారు. దీంతో వీరి వివరాలను ఈకేవైసీ చేయనవసరం లేదు. ఈకేవైసీ ప్రక్రియను ఈనెల 30వ తేదీలోపు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశిం చింది. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో నమోదు జరగడం లేదు. గతనెల 11 నుంచి 31 వరకు తొలివిడత ఈకేవైసీ నమోదు జరిగింది. పెద్దఎత్తున నమోదు పెండింగ్‌ ఉండడంతో కేంద్రప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు గడువు పెంచింది.

ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలి

ఈకేవైసీ నమోదు ప్రక్రియ వేగవంతం అయ్యే లా రేషన్‌డీలర్లు, ఎండీయూ వాహనాల ఆపరే టర్లకు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది.

కాకినాడ జిల్లాలో..

జిల్లాలో 18 లక్షల 31వేలమంది రేషన్‌ కార్డు సభ్యుల వివరాలను ఈకేవైసీ చే యాల్సి ఉంది. వీరిలో ఇప్పటివరకు 16 లక్షల 64వేలమంది వివరాలు నమోదు చేశారు. ఇంకా లక్షా 36 వేలమంది వివరా లు నమోదు చేయాల్సి ఉంది. ఐదేళ్లలోపు చిన్నారులు, 80ఏళ్లు దాటిన వృద్ధులు 30 వేల మంది వివరాలు నమోదు చేసే అవ సరంలేదు. వీరికి మినహాయింపు ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

ఈ జిల్లాలో 15లక్షల77వేలమంది రేష న్‌ కార్డులో సభ్యులు వివరాలు ఈకేవైసీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 14 లక్షల 58వేల వివ రాలు నమోదు చేశారు. ఇంకా 92,620 మంది వివరాలు ఈకేవైసీ చేయాల్సిఉంది. రేషన్‌డీలర్లు, ఎండీయూ వాహనాల్లో ఆశించిన స్థాయిలో న మోదు జరగడంలేదని రేషన్‌దారులుంటున్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో..

ఈ జిల్లాలో 15లక్షల25వేలమంది రేషన్‌కార్డుల్లో సభ్యులు వివరాలను ఈకేవైసీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 14లక్షల వెయ్యిమంది వివరాలు నమోదయ్యాయి. ఇంకా 94వేలమంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - Apr 15 , 2025 | 01:06 AM