పాస్టర్ ప్రవీణ్ కేసులో రీపోస్టుమార్టానికి ఎన్‌వోసీ ఇవ్వండి
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:34 AM
రాజమహేంద్రవరంసిటీ, ఏప్రిల్ 2(ఆంధ్ర జ్యోతి): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి ఘటనకు సంబంధించిన కేసులో పాస్టర్ పార్ధివదేహానికి ఉస్మాని యా వైద్యులతో ప్రైవేటు పోరెన్సిక్ ల్యాబరేటరీ పర్యవేక్షణలో రీపోస్టుమార్టం నిర్వహించేందుకు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎంపీ హర్ష తనయుడు శ్రీరాజ్ వినతి
రాజమహేంద్రవరంసిటీ, ఏప్రిల్ 2(ఆంధ్ర జ్యోతి): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి ఘటనకు సంబంధించిన కేసులో పాస్టర్ పార్ధివదేహానికి ఉస్మాని యా వైద్యులతో ప్రైవేటు పోరెన్సిక్ ల్యాబరేటరీ పర్యవేక్షణలో రీపోస్టుమార్టం నిర్వహించేందుకు ఎన్‌వోసీ ఇవ్వాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీహర్షకుమార్ తరుపున ఆయన తనయుడు జీవీ శ్రీరాజ్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతిని కలిసి వినతిపత్రం అందచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుపై తెలుగువారిలో ఆసక్తి ఉందని, ఫెయిర్ అండ్ ట్రాన్సపరెంట్ ఇన్విస్టిగేషన్ జరిగి నిజాన్ని నిగ్గు తేల్చక పోతే రానున్నకాలంలో ఇటువంటి బాధాకరమైన సంఘటనలు ఎన్నో జరుగుతాయని తెలిపారు. ఎన్‌వోసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.