స్వామివారి ఆదాయం రూ.1.72లక్షలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:15 AM
మందపల్లి శనేశ్వర(మందేశ్వర) స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

కొత్తపేట, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మందపల్లి శనేశ్వర(మందేశ్వర) స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామివారి సర్వ దర్శనాలు, తైలాభిషేకాలకు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బం దులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి రూ.1,72,446 ఒకరోజు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమీషనరు నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.