Share News

కేశవస్వామి ఆలయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూజలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:13 AM

ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో శనివారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ టీఎన్‌ వెంకటేష్‌ స్వామివారిని దర్శించుకున్నారు.

కేశవస్వామి ఆలయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూజలు

ఆత్రేయపురం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో శనివారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ టీఎన్‌ వెంకటేష్‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో బీహెచ్వీ రమణమూర్తి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం అందించారు.

Updated Date - Mar 16 , 2025 | 01:13 AM