సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడొద్దు
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:06 AM
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకురావాలని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి దుర్గేష్ అన్నారు.

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 15( ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకురావాలని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వై జంక్షన్ నుంచి పుష్కరాల రేవు వరకు స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ చేశారు. ర్యాలీని కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. పుష్కరాల రేవు వద్ద ఏర్పాటు చేసిన సభ వద్ద స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. మంత్రి దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి , జిల్లా ఎస్పీ నరసింహకిశోర్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, కమిషనర్ కేతన్ గార్గ్‌లు పోస్టర్‌పై సంతకాలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ కాలు ష్య కారకాలను దూరం పెట్టాలన్నారు. ఎమ్మె ల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆరోగ్య కం టే డబ్బు విలువైనది కాదన్నారు. కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రించే క్రమంలో అవగాహన కల్పించామన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను అధికారులు ,ప్రజాప్రతినిదులు సందర్శించారు. కార్యక్రమంలో నగరపాలక సం స్థ అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి దుర్గేష్ జనవాణి
నిడదవోలు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : ప్రజాప్రతినిధిగా తానున్నది ప్రజల సమ స్యలు పరిష్కరించడం కోసమేనని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజాస మస్యల పరిష్కార వేదిక జనవాణి నిర్వహిం చారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీక రించి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధి కారులతో మాట్లాడి ప్రజాసమస్యల పరి ష్కారానికి చొరవ తీసుకున్నారు.