ఏడిదలో ఘనంగా కైలాసేశ్వరస్వామి ప్రతిష్ఠ
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:11 AM
ఏడిద గ్రామంలోనున్న కైలాసేశ్వరస్వామి ఆలయ పునః ప్రతిష్ఠ శనివారం వైభవంగా జరిగింది.

మండపేట, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఏడిద గ్రామంలోనున్న కైలాసేశ్వరస్వామి ఆలయ పునః ప్రతిష్ఠ శనివారం వైభవంగా జరిగింది. ఈ ఆలయం శిఽఽథిలావస్థకు చేర డంతో దేవాదాయ ధర్మాదాయశాఖ నిధుల తోపాటు, స్థానికుల విరాళాలతో ఆలయాన్ని పునఃనిర్మించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో ఐదు రోజుల నుంచి ఆలయం వద్ద పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిపారు. గ్రామానికి చెం దిన ముత్తారెడ్డి సుబ్రహ్మణ్య చౌదరి దంపతు లు కూర్చుని ఆయా కార్యక్రమాలను జరి పారు. బాదంపూడి సత్యనారాయణ సారధ్యం లో వేద పండితులు ఆయా కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ పునః ప్రతిష్ఠలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, గ్రామానికి చెందిన పారిశ్రా మికవేత్తలు నామాల పురుషోత్తం, బీఎస్‌ఆర్ సంస్థల అధినేత బలుసు శ్రీనివాసరావు, ్ట్రకాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, స్థానిక నేతలు సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.