Share News

ఇక్కడా..విదేశీ బ్రాండ్లు!

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:04 AM

మందుబాబులకు ఇష్టమైన బ్రాండ్లు దొరి కితే తెగ తాగేస్తారు.. అదే ఫారెన్‌ బ్రాండ్లు అంటే మరీ మోజు.. కానీ మన దగ్గర ఫారెన్‌ బ్రాండ్లు దొరకడం అసాధ్యం.. ఇప్పుడు ఫారెన్‌ బ్రాండ్లన్నీ ఉమ్మడితూర్పుగోదావరి జిల్లాలోనే దొరకనున్నాయి.

ఇక్కడా..విదేశీ బ్రాండ్లు!

త్వరలో వాక్‌ ఇన్‌ మద్యం స్టోర్లు

ఒక్కో దుకాణానికి రూ.కోటి ఫీజు

ఏటా 10 శాతం లైసెన్స్‌ ఫీజు పెంపు

దక్కించుకున్న ఇద్దరు వ్యాపారులు

ఐదేళ్ల కాలపరిమితితో మంజూరు

ఫారిన్‌ బ్రాండ్ల విక్రయానికి ఓకే

గత వైసీపీలో పదికిపైగా షాపులు

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

మందుబాబులకు ఇష్టమైన బ్రాండ్లు దొరి కితే తెగ తాగేస్తారు.. అదే ఫారెన్‌ బ్రాండ్లు అంటే మరీ మోజు.. కానీ మన దగ్గర ఫారెన్‌ బ్రాండ్లు దొరకడం అసాధ్యం.. ఇప్పుడు ఫారెన్‌ బ్రాండ్లన్నీ ఉమ్మడితూర్పుగోదావరి జిల్లాలోనే దొరకనున్నాయి. మెట్రోపాలిటిన్‌ సిటీల్లో అం దుబాటులో ఉండే బ్రాండ్‌లు సైతం లోకల్‌గానే దొరికేస్తాయండోయ్‌.. అవునండి బాబూ నిజమే. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజ మహేంద్రవరం నగరాల్లో రెండుచోట్ల రెండు వాక్‌ ఇన్‌ మద్యం స్టోర్లకు అనుమతిచ్చింది. వీటికి టెండర్లు పిలవగా ఇద్దరు వ్యాపారులు ఈ రెండు స్టోర్లను దక్కించుకున్నారు.. ఒక్కో స్టోర్‌కు ఏడాదికి లైసెన్స్‌ ఫీజు ఎంతో తెలు సా.. అక్షరాలా రూ.కోటి.. ఐదేళ్లపాటు లైసెన్స్‌ లభిస్తుండడంతో వీటిని ఎగరేసుకుపోయారు.. స్టోర్‌ దక్కించుకున్న వ్యాపారులు ఏటా లైసె న్స్‌ ఫీజుపై 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.. వీటికున్న డిమాండ్‌తో స్టోర్లను సదరు వ్యాపారులు ఎగరేసుకుపోయారు. కాకినాడ మెయిన్‌రోడ్డులో రాబోతున్న ఈ స్టోర్‌ను విజయవాడకు చెందిన ఓ వ్యాపారి.. రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో రాబోతున్న స్టోర్‌ను స్థానిక వ్యాపారి పోటీలో దక్కించుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ లైసెన్సు జారీ చేసింది. 45 రోజుల్లో ఇవి తెరుచుకోనున్నాయి. సాధారణ ప్రైవేటు మద్యం దుకాణంలో దొరికే అన్ని రకాల బ్రాం డ్లతోపాటు విదేశీ సరుకు వీటిలో లభ్యం కావ డం ప్రత్యేకత. వివిధ దేశాలకు చెందిన ప్ర ముఖ వైన్‌, విస్కీ బ్రాండ్లతోపాటు షాంపైన్‌ కూడా వీటిలో విక్రయించనున్నారు. చెప్పా లంటే ఫారెన్‌ బ్రాండ్లన్నీ దాదాపు వీటిలో దొర కనున్నాయి. ఏ విదేశీ బ్రాండ్‌ కావాలో సదరు వ్యాపారి లిక్కర్‌ డిపోకు ఆర్డరు ఇస్తే ఆ మం దును స్టోర్‌లకు సరఫరా చేయనున్నారు. సాధారణ సూపర్‌ మార్కెట్‌ తరహాలో మద్యం ప్రియులు ఈ స్టోర్‌కు వెళ్లి సరుకులు కొనుగోలు చేసుకున్నట్టే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభు త్వంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పది వరకు వాక్‌ ఇన్‌ స్టోర్లను ఎక్సైజ్‌శాఖ నగ రాలు, పట్టణాల్లో తెరిచింది. వీటిలో అప్పటి సర్కారు ఆదేశాలతో నాసిరకం మద్యం బ్రాం డ్లను రెట్టింపు ధరకు విక్రయించి కొందరు ప్రభుత్వ పెద్దలు కోట్లలో సంపాదించారు. కానీ ఈ వాక్‌ ఇన్‌ స్టోర్లలో అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన విదేశీ బ్రాండ్లను విక్ర యించనున్నారు. ఈ తరహా దుకాణాలకు రెండింటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated Date - Mar 16 , 2025 | 01:04 AM