Praveen Case: ప్రవీణ్ పగడాల మృతి.. పోలీసులు ఏం తేల్చారంటే
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:11 AM
Praveen Case: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ వీడింది. ఆయన ఎలా మరణించారు అనేదానిపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

రాజమండ్రి, ఏప్రిల్ 12: పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుపై (Paster Praveen Pagadala) ఐజీ అశోక్ కుమార్ (IG Ashok Kumar) క్లారిటీ ఇచ్చారు. శనివారం ఐజీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రవీణ్ పగడాల గత నెల 24న మృతి చెందారని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకొని కేసు దర్యాప్తు చేశామన్నారు. 26న పోస్టుమార్టం చేసినట్లు చెప్పారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవునా సీసీ ఫుటేజ్‌ను సేకరించినట్లు చెప్పారు. వాటన్నింటినీ హైదరాబాద్ పోరెనిక్స్ ల్యాబరేటరీకి పంపామన్నారు. ఈ కేసుపై ఎన్నో రకాలుగా విచారణ జరిపామన్నారు. దారి పొడవునా ప్రవీణ్‌ను గమనించిన వారిని, ఫోన్‌లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశామన్నారు. కుటుంబసభ్యులను కూడా విచారించామన్నారు. ప్రవీణ్ చనిపోయిన స్థలాన్ని విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆధారాలను సేకరించారని చెప్పారు. అంతే కాకుండా ప్రవీణ్ ప్రయాణించిన బైక్‌తో పాటు.. కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైక్‌లను కూడా ఎగ్జామిన్ చేసినట్లు తెలిపారు. యూపీఐ పేమెంట్స్‌ను కూడా సేకరించామన్నారు.
ఎక్కడకు వెళ్లారు.. ఏమేం చేశారు
తమకు ఎవరిపైనే అనుమానం లేదని కుటుంబసభ్యుల కూడా చెప్పారన్నారు. విచారణ జరిపి ఆయన మరణానికి కారణమేంటో చెప్పాలని అన్నారన్నారు. ప్రవీణ్ ప్రయాణం చేస్తూ ఆరు మందితో సెల్‌ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కొంతమంది సోషల్ మీడియాలో హత్య అని అనుమానాలు వ్యక్తం చేశారని.. వారిని కూడా విచారణ చేశామన్నారు. గత నెల 24న 11 గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయలుదేరారని.. బుల్లెట్‌ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలని ఆలోచనతో ఆయన బుల్లెట్‌పై బయలుదేరారన్నారు. ‘12.15 గంటలకు నాగోలు సవేరా లిక్కర్ మార్ట్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు. జగ్గయ్యపేట వద్ద రోడ్‌పై లారీని ఓవర్ టేక్ చేస్తూ రోడ్‌పై పడిపోయారు. వేగంగా వస్తూ కీసర గ్రామం వద్ద రోడ్ పక్కన పడిపోయారు. హెడ్ లైట్ పగిలిపోయింది. 4.51 గంటలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు. మాస్క్ కూడా లేదు. విజయవాడ దుర్గగుడి ప్లై ఓవర్ 5 గంటలకు వచ్చారు. 5.15 కు రామవరప్పాడు వచ్చి కింద పడిపోయారు. ఆటో డ్రైవర్ ట్రాపిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్‌తో మాట్లాడారు. ఇక్కడ టీ తాగారు. రాత్రిపూట కాలపర్రు టోల్ ప్లాజా వద్దకు వచ్చారు. రైట్ సైడ్ బ్లింకర్‌తోనే ప్రయాణిస్తున్నారు. ఏలూరులో నిపున్ టానిక్ వైన్ షాపు వద్దకు రాత్రిపూట 10.10 గంటలకు వచ్చారు. పోన్ పే చేశారు. కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి 11:31 గంటలకు వచ్చారు. బుల్లెట్‌పై అతివేగంగా వెళుతున్నారు. నయారా పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 11.42 గంటలకు రోడ్ పక్కన పడిపోయారు’ అంటూ ఐజీ తెలిపారు.
Inter Results: ప్రయోగాత్మకంగా ఇంటర్ ఫలితాలు.. విడుదల చేసిన మంత్రి లోకేష్
మద్యం వల్లే
సెంట్రల్ పోర్సెనిక్ ల్యాబరేటరీ వాళ్ళు సీసీ పుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. రోడ్‌పై నుంచి జారీపడటం వల్ల బుల్లెట్‌పైన పడిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ 4వ గేర్‌లో ఉందన్నారు. ఎవరూ గుద్దలేదని రవాణాశాఖ అధికారులు నిర్థారించారని చెప్పారు. ఆరుసార్లు యూపీఏ పేమెంట్స్ చేశారని చెప్పారు. సెల్‌ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు. పోస్టుమార్టమ్ వీడియోగ్రాప్ ద్వారా లిక్కర్ సేవించినట్టు నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్ ప్రమాదం జరగటం వల్ల అయినట్టు వైద్యులు నిర్ధారణ చేశారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్ ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఆల్కహాల్ కొనుగోలు చేయటంతో పాటు వినియోగించినట్టు నిర్ధారించామని చెప్పారు. 42 నుంచి 62 సీసీ కెమారాల ద్వారా పుటేజ్ స్వీకరించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
Inter Results: ఏపీలో ప్రయోగాత్మకంగా ఇంటర్ ఫలితాలు..
Read Latest AP News And Telugu News