Share News

గాలి..పోతోంది!

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:02 AM

ఫ్యాన్‌ ‘గాలి’ పోతోంది.. ఎటువైపు వీలుంటే అటువైపు పోతోంది.. అధికారం ఉన్నప్పుడు విర్ర వీగిపోయిన వైసీపీ గణం.. అధికారం పోవడంతో నెమ్మదిగా సర్దుకుంటోంది.

గాలి..పోతోంది!

ఫ్యాన్స్‌.. పక్కచూపులు

ఖాళీ అవుతున్న వైసీపీ

ఇప్పటికే తుని టీడీపీ కైవశం

జనసేనలో నిడదవోలు చైర్మన్‌

సైలెంట్‌గా కొవ్వూరు చైర్‌పర్సన్‌

మిగిలిన పురాలదీ అదే పరిస్థితి

జడ్పీటీసీలు..సర్పంచ్‌లు క్యూ

జూన్‌లో కార్పొరేషన్‌ ఎన్నికలు

స్థానిక పట్టునకు ప్రయత్నాలు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఫ్యాన్‌ ‘గాలి’ పోతోంది.. ఎటువైపు వీలుంటే అటువైపు పోతోంది.. అధికారం ఉన్నప్పుడు విర్ర వీగిపోయిన వైసీపీ గణం.. అధికారం పోవడంతో నెమ్మదిగా సర్దుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్ని కల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు కొవ్వూరు డివిజన్‌లోనూ కూటమి పార్టీలు క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన టీచర్స్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం వైసీపీ ఊసే వినిపించలేదు. దీంతో ఆ పార్టీ నేత లతోపాటు, కార్యకర్తలు రోజురోజుకు దిగజారుతున్న పార్టీ పరిస్థితి చూసి మెల్లగా జారుకుంటున్నారు. గాలివీయని పార్టీలో ఇక ఎందుకు ఉక్కబోత తప్ప అని కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థలైన పం చాయతీలు, మునిసిపాలిటీలు, జడ్పీలో ఉన్న వైసీపీ ప్రతినిధులు నెమ్మదిగా జారుకుంటున్నా రు. వివిధ కారణాలతో ఆదిలోనే కొవ్వూరుకు చెందిన రాజీవ్‌కృష్ణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుగానే తప్పుకోవడం మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. కాకినాడ జిల్లాలోని తుని మునిసిపాలిటీయే అందుకు ఉదాహరణ. టీడీపీకి అక్కడ ఒక్క సీటు లేకపోయినా వైసీపీ కౌన్సిలర్లంతా టీడీపీలో చేరిపోయారు. దీంతో తుని మునిసిపాలిటీ టీడీపీ ఖా తాలో పడింది. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వారంతా ఇటు పయనించారని ఎవరికైనా అర్థమవుతుంది. అదే పరిస్థితి నిడదవోలులోనూ పునరావృత్తం కానున్నట్టు సమాచారం. ఇప్పటికే అక్కడ చైర్మన్‌ జనసేనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పదిమంది కౌన్సిలర్లతో వెళ్లి మంత్రి దుర్గేష్‌ సమ క్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. వచ్చే కౌన్సిల్‌ సమావేశంలో నిడదవోలు జనసేన వశ మయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. ఇక కొ వ్వూరులోనూ ఇలాగే ఉంది. చైర్మన్‌ ఇప్పటికే గౌరవం లభించడంలేదని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం మునిసిపల్‌ కార్యక్రమాలకే హాజరవుతున్నారు. కొవ్వూరులో ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తాజా సమాచారం. కొవ్వూరులో ఇప్పటికే ఏడుగురు టీడీపీ కౌన్సిలర్లు ఉండగా మరో 8 మంది వెళితే కొవ్వూరు టీడీపీ వశమవుతోంది. దీంతో పలువురు ‘ఫ్యాన్‌’ కౌన్సి లర్లు టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలిసింది.

కూటమికి కలిసొచ్చే కాలం..

వచ్చే ఏడాది వరకూ స్థానిక సంస్థల ఎన్నిక లకు గడువు ఉంది. కానీ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత మునిసిపల్‌ చైర్మన్లు, సర్పంచ్‌లు, జడ్పీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టే అవ కాశం ఉండడం కూడా కూటమికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సర్పంచ్‌ పాలక వర్గాలకు నాలుగేళ్లు నిండాయి. మార్చి నెలతో మునిసిపల్‌ పాలకవర్గాలకు నాలుగేళ్లు నిండిపో తాయి. సెప్టెంబరులో జడ్పీలకు నాలుగేళ్లు నిం డిపోతాయి. అధికారంలో ఉన్న పార్టీలకు స్థాని కంగా బలం ఉంటుంది కాబట్టి స్థానిక ప్రజాప్ర తినిధులంతా అటువైపే మొగ్గు చూపడం సహ జం. దీంతో వైసీపీలో భారీగా వలసలు తథ్యం.

నాడు స్థానికంలో అప్రజాస్వామికం..

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అప్రజాస్వామికంగా, దౌర్జన్యకరంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రతిపక్ష పార్టీలను నామినేషన్లు వేయనివ్వని పరిస్థితి. దీంతో అన్ని మునిసిపాలిటీల్లోనూ వైసీపీనే విజయం సాధించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 12 మునిసిపాలిటీల్లో అప్పట్లో వైసీపీకి 319 మంది కౌన్సిలర్లు, టీడీపీకి 50, జనసేనకు 18, బీజేపీకి 8, కాంగ్రెస్‌ తరపున ఒక కౌన్సిలర్‌ ఎన్నికయ్యారు. ఇప్పటికే చాలామంది పార్టీ మారిన సంగతి తెలిసిందే. రాజమహేంద్ర వరం, కాకినాడ కార్పొరేషన్లకు వైసీపీ ఎన్నికలు నిర్వహించడానికి భయపడిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరో వైపు రెండు కార్పొరేషన్లు టీడీపీ కంచుకోటలు కావడంతో ఎన్నికల దిశగా ఆలోచించడమే మానుకుంది. ఐదేళ్లూ ఎన్నికలు నిర్వహించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేషన్లకు జూన్‌లో ఎన్నికలు నిర్వహించ డానికి సన్నాహాలు చేస్తోంది. వాటితోపాటు మొత్తం మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వ హిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత కావలసి ఉంది. 2021 ఫిబ్రవరి 9 నుంచి 21వ తేదీ వరకూ పంచాయతీ ఎన్నికలు 4 దశల్లో జరి గాయి. ఆ ఎన్నికల్లో వైసీపీకి 805 సర్పంచ్‌ పదవులు రాగా, టీడీపీ, మిత్రపక్షాలకు 143 లభించాయి. అందులో ఇప్పటికే చాలామంది కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. జడ్పీ ఎన్నికలు వాస్తవానికి 2020లో మార్చిలో జర గాలి. కరోనా వల్ల వాయిదా పడ్డాయి. 2021 ఏప్రిల్‌ 8వ తేదీన ఎన్నికలు నిర్వహించగా 2021 సెప్టెంబరు 19న ఫలితాలు ప్రకటిం చారు. వచ్చే సెప్టెంబరుకు నాలుగేళ్లు పూర్త వుతుంది. ఇప్పటికే చాలామంది జడ్పీటీసీలు కూటమిలో చేరగా కొందరు జడ్పీటీసీలు సైలెంట్‌ అయ్యారు. కొద్దిరోజుల్లో స్థానికంగా ఇంకా మార్పులు రానున్నాయి.

Updated Date - Mar 16 , 2025 | 01:02 AM