Tirumala Rama Pattabhishekam: శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:24 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరిగింది. భద్రాచలంలో టీటీడీ తరఫున శ్రీరాములకు పట్టువస్త్రాలు సమర్పించారు

తిరుమల, ఏప్రిల్6(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామనవమి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని బంగారువాకిలి వద్ద ఆస్థానాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి తోమాలసేవ, అర్చన సేవలను నిర్వహించారు. తర్వాత ఆలయంలోని రంగనాయకమండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంత స్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవను కన్నులపండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. రాత్రి హనుమంత వాహనసేవ వేడుకగా నిర్వహించారు. శ్రీరాములవారు హనుమంతునిపై కొలువుదీరి మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, సోమవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
భద్రాద్రి రాముడికి టీటీడీ పట్టువస్ర్తాల సమర్పణ
శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణలోని భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని ఉత్సవమూర్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పట్టువస్ర్తాలు అందజేశారు. భద్రాచలం ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్‌కు ఆ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ఈవో రమాదేవి ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. పట్టువస్ర్తాలు సమర్పించిన అనంతరం చైర్మన్ దంపతులు సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్