DGP Harish Kumar Gupta: గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తాం
ABN, Publish Date - Feb 22 , 2025 | 08:59 PM
AP DGP Harish Kumar Gupta: డ్రగ్స్ ఫ్రీ ఏపీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా: గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఏపీ ప్రభుత్వం గంజాయి రవాణాపై దృష్టి పెట్టిందని అన్నారు. కృష్ణా జిల్లాలోని 4 సబ్ డివిజన్లలో ఇవాళ(శనివారం) గంజాయిని సీజ్ చేశారు. కోటి 87లక్షల 25 వేల విలువ కలిగిన గంజాయిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడారు. డ్రగ్స్ నివారణపై కొత్తగా ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంటర్ స్టేట్ గ్యాంగ్‌లపై నిఘా పెట్టామని అన్నారు. ఒడిస్సా రాష్ట్రం నుంచి గంజాయి రవాణా అవుతుందని తెలిపారు. ఏపీలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు.
ఏపీ నుంచి గంజాయి రవాణా జరుగుతుందని తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాలను పట్టుకుంటున్నామని అన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వాళ్ల ఆస్తులు సీజ్ చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, గంజాయి రవాణా చేసే వాళ్లను ఈ సందర్భంగా హెచ్చరించారు. కాలేజ్‌ల వద్ద గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేస్తున్నామని అన్నారు. గంజాయి రవాణా, విక్రయించవద్దని విజ్ఞప్తి చేశారు. సెక్యూరిటీ అడిగిన వారికి ఇస్తున్నామని అన్నారు. గిరిజనులు గంజాయి సాగు చేపట్టవద్దని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇతర పంటల సాగుపై కూడా వారికి ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. కాలేజ్‌ల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Feb 22 , 2025 | 09:09 PM