Guntur Politics: గుంటూరులో వేడెక్కిన రాజకీయం.. కౌన్సిల్ సమావేశంపై సందిగ్ధత

ABN, Publish Date - Jan 16 , 2025 | 12:32 PM

Guntur Politics: గుంటూరు నగర పాలక సంస్థలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. కౌన్సిల్ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ఈ సమావేశం గురించి వైసీపీ సభ్యులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొని వైసీపీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Guntur Politics: గుంటూరులో వేడెక్కిన రాజకీయం.. కౌన్సిల్ సమావేశంపై సందిగ్ధత
Guntur Municipal Corporation

గుంటూరు జిల్లా: గుంటూరు నగర పాలక సంస్థలో రాజకీయాలు వేడెక్కాయి. కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. గుంటూరులో వైసీపీ నేతలు అత్యవసర సమావేశం అయ్యారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ..గుంటూరు కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాప్రతినిధులు, ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని చెప్పారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉండగా తప్పించుకునే ప్రయత్నం చేశారని అన్నారు. మేయర్‌కు సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయారని మండిపడ్డారు.ఈ సభలో కమిషనర్ దురుసుగా ప్రవర్తించారని అన్నారు. పబ్లిక్ సర్వెంట్, సీనియర్ అధికారి ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు.


వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్‌కి ఈనెల 7వ తేదీన లిఖిత పూర్వకంగా, వాట్సాప్, మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చానని గుర్తుచేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. చట్టప్రకారం మేయర్‌కు కూడా కౌన్సిల్ సమావేశం పెట్టే అధికారం ఉందని గుర్తుచేశారు. ఈనెల 17వ తేదీన కౌన్సిల్ సమావేశం పెట్టాల్సి ఉంటుందని అన్నారు. వాయిదా పడిన అనంతరం 3 రోజులకు కౌన్సిల్ సమావేశం తప్పనిసరిగా పెట్టాలని చెప్పారు.సంక్రాంతి సంబరాలు సందర్భంగా ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమానించారని అన్నారు. రేపు (శుక్రవారం) నాటికి వైసీపీ కార్పొరేటర్లు అందరూ నగరపాలక సంస్థకు చేరుకుంటారని తెలిపారు.కమిషనర్ ఎలా వ్యవహరిస్తారనే విషయంపై శుక్రవారం గమనించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పష్టం చేశారు.


వారే వాకౌట్ చేస్తారు: మాజీ మంత్రి అంబటి రాంబాబు

గుంటూరు నగరపాలక సంస్థలో మేయర్ మాత్రమే సుప్రీం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైసీపీ నేతలు గురువారం అత్యవసర సమావేశం అయ్యారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు మేయర్ మరో 14 నెలలు అధికారంలో ఉంటారని తెలిపారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు మాత్రమే కౌన్సిల్ నుంచి వాకౌట్ చేస్తారని అన్నారు. అహంకారంతో కమిషనర్ వ్యవహారించారని మండిపడ్డారు. కమిషనర్ చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు. కమిషనర్ తీరును వైసీపీ తీవ్రంగా పరిగణించిందన్నారు.కమిషనర్ తీరును తప్పుపడుతూ ఏపీవ్యాప్తంగా ప్రజా పోరాటం చేస్తామని చెప్పారు. మూడేళ్లలోకమిషనర్ పులి శ్రీనివాసులు రిటైర్ కానున్నారని.. కష్టాల్లో పడతారని చెప్పారు. ఎక్కడ ఉన్నా పులి శ్రీనివాస్ దోపిడి వెలికి తీసి రోడ్డుపై నిలబెడతామని అంబటి రాంబాబు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన.. మహిళ జుట్టు కత్తిరించి..

Nandyala: మంత్రి ఇంటిపై డ్రోన్ కలకలం

Crime News: గుడివాడలో ప్రాణం తీసిన సిగరెట్...

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 16 , 2025 | 12:53 PM