CR Patil: పోలవరం ప్రాజెక్టుపై లోక్‌సభలో చర్చ.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఏమన్నారంటే..
ABN, Publish Date - Mar 21 , 2025 | 09:43 PM
CR Patil:గత యాభై ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు కోసం ఎవరు వచ్చినా ఎలాంటి పురోగతికి నోచుకోలేదని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. 2.91 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు.

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై శుక్రవారం నాడు లోక్‌సభలో చర్చ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. జలశక్తి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌కి రిప్లైలో సీఆర్ పాటిల్ పలు వివరాలు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనేక ప్రభుత్వాలు వచ్చినా ఏమి చేయలేదని అన్నారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక... 2015 నుంచి రూ. 15 వేల కోట్లకు పైగా కేటాయించి... పనులు ప్రారంభించినట్లు సీఆర్ పాటిల్ గుర్తుచేశారు.
ఈ ఏడాది కూడా రూ. 12 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేశామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. 2026 వరకు ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సూచనలు కూడా చేశారని చెప్పారు. గత 50 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కోసం ఎవరు వచ్చినా ఎలాంటి పురోగతికి నోచుకోలేదని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. 2.91 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల విశాఖపట్నంతో సహా మరో 540 గ్రామాలకు తాగునీరు లభిస్తుందని అన్నారు. 28.5 లక్షల మందికి లాభం జరుగుతుందని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పేర్కొనారు.
ఈ వార్తలు కూడా చదవండి
Marri Rajasekhar: నన్ను అవమానించారు.. విడదల రజినీపై మర్రి రాజశేఖర్ ఫైర్
Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే
CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 21 , 2025 | 09:46 PM