AP News: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అంతే లేదా.. మరొకరు బలి
ABN , Publish Date - Jan 21 , 2025 | 10:58 AM
Andhrapradesh: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయి.. వాటి తీర్చే మార్గం తెలియక ప్రాణాలు తీసుకోడానికి కూడా సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ చేసి లక్షలకు పైగా డబ్బులు పోగోట్టుకున్నాడు. చివరకు అప్పుల బాధతో యువకుడు తీసుకున్న నిర్ణయం ఇంట్లో విషాదాన్ని నింపింది.

పల్నాడు జిల్లా, జనవరి 21: అతనో కూరగాయల వ్యాపారి. రోజూ కూరగాయలు అమ్ముకుంటూ ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ అతడు ఒక దానికి బానిసగా మారిపోయాడు. ఎంతలా అంటే దాని కోసం అప్పులు చేసుకుంటూ పోయాడు. చివరకు వాటిని తీర్చే మార్గం లేక యువకుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇంతకీ యువకుడు బానిసైంది ఆన్‌లైన్ బెట్టింగ్‌లకే. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఎంతో మంది బలైపోతున్నారు. తొలుత సరదాగా అనిపించేది కాస్తా.. రాను రానుగా ఒక వ్యసనంలా మారిపోతుంది. ఏది ఏమైనా కచ్చితంగా బెట్టింగ్‌లు కట్టాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఒకసారి కాకపోయినా ఒకసారి డబ్బులు వస్తాయనే ఆశతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు కాస్తుంటారు.. చివరకు ఉన్నదంతా పోగా.. అప్పులు చేస్తుంటారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయి.. వాటిని తీర్చే మార్గం తెలియక ప్రాణాలు తీసుకోడానికి కూడా సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ చేసి లక్షలకు పైగా డబ్బులు పోగోట్టుకున్నాడు. చివరకు అప్పుల బాధతో యువకుడు తీసుకున్న నిర్ణయం ఇంట్లో విషాదాన్ని నింపింది. ఇంతకీ యువకుడు చేసిన పనేంటి.. ఆన్‌లైన్‌లో ఎంత పోగొట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం.
భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది నక్సలైట్లు మృతి
జిల్లాలోని నరసరావుపేటలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఓ యువకుడు బలయ్యాడు. పట్టణంలోని ప్రకాష్ నగర్‌లో ఉంటున్న కనుపోలు ఉదయ్ కిరణ్(32) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఉదయ్ కిరణ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో దాదాపు రూ.10 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు యువకుడు. బెట్టింగ్‌ల కోసం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేసిన యువకుడు.. చివరకు ఉన్నదంతా పోవడంతో అప్పులు తీర్చలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఉదయ్ కిరణ్ బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానం వచ్చి చూడగా.. యువకుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పులు బాధతో కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Davos: అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు
Encounter.. కాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రా జవాన్ మృతి
Read Latest AP News And Telugu News