Share News

Inter Results: ప్రయోగాత్మకంగా ఇంటర్ ఫలితాలు.. విడుదల చేసిన మంత్రి లోకేష్

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:03 AM

Inter Results 2025: ఏపీలో శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. అయితే ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్‌లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు.

Inter Results: ప్రయోగాత్మకంగా ఇంటర్ ఫలితాలు.. విడుదల చేసిన మంత్రి లోకేష్
AP Intermediate exam Results

అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP Intermediate exam Results) శనివారం విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) విడుదల చేశారు. విద్యార్థులు resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సాప్‌ (Manamitra WhatsApp) నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు చూడొచ్చని సూచించారు. ఫోన్‌లో రెండు నిముషాల్లో ఫలితాలు చూసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బెస్ట్ విషెస్ చెబుతూ.. ఇంటర్‌ ఫలితాలు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు మార్గం చూపుతాయని లోకేష్ పేర్కొన్నారు.

Also Read..: KCR: ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయాం...


ప్రయోగాత్మకంగా ఇంటర్ ఫలితాలు..

అయితే ఈసారి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఇంటర్, మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్‌(WhatsApp governance)లో హాయ్ (hi) అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. గతంలో ప్రభుత్వాలు పరీక్షా ఫలితాల విడుదల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ఫలితాలు విడుదల చేసేవి. ఈసారి రొటీన్‌కు భిన్నంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో http://resultsbie.ap.gov.in ఫలితాలు ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్‌లో విద్యార్థులు ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్‌ లో మనమిత్ర చాట్‌లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లో ఫలితాలు కళ్ళముందు కనిపించేటట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు. మన మిత్ర వాట్స్ యాప్ నంబర్‌కు 9552300009లో ‘hi’ అని కొట్టి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చునని మంత్రి లోకేష్ చెప్పారు. అందరికి మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ లోకేష్ బెస్ట్ విషెస్ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం..

శోభాయమానంగా హనుమాన్ జయంతి వేడుకలు

For More AP News and Telugu News

Updated Date - Apr 12 , 2025 | 11:11 AM