Share News

AP News: నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్

ABN , Publish Date - Apr 07 , 2025 | 09:33 AM

రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీనివల్ల తాము దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు.

AP News: నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్
Healthcare Services Suspension

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని సోమవారం నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో (Network Hospitals) వైద్యసేవలు (Healthcare Services) నిలిచిపోనున్నాయి. తమకు రావాలసిన బకాయిలు చెల్లించాలని (Pending Payments) వివిధ దశల్లో నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం ఆందోళనలు చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్లకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వినతిపత్రాలు ఇచ్చింది. సుమారు రూ.3,500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆసుపత్రుల సంఘం చెబుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వైద్యసేవలు నిలిపి వేయాల్సి వచ్చిందని సంఘాలు అంటున్నాయి. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుమారు 2,500 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రేపో మాపో ఆసుపత్రుల యజమానుల సంఘాన్ని చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

Also Read..: తగ్గుతున్న బంగారం ధరలు..


కాగా రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీనివల్ల తాము దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. బకాయిల విడుదల కోసం ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌కు అనేకసార్లు విన్నవించామని, లిఖితపూర్వకంగానూ కోరామని తెలిపారు. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే కానీ మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ సరఫరా చేయలేమని ఆయా కంపెనీలు చేతులెత్తేస్తున్నాయని చెప్పారు. వైద్యులు, సిబ్బందికి 2 నెలలుగా జీతాలు నిలిపివేశామని చెప్పారు. దీనిపై గతనెల 7న ట్రస్ట్‌కు లేఖ రాశామని, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు.


బకాయిలు విడుదల చేయాలంటూ గతేడాది జూలై నుంచి ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాశామని డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌ అన్నారు. 2025-26 బడ్జెట్‌లో ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకానికి రూ.4వేల కోట్లు కేటాయించగా, బకాయిలే రూ.3,500కోట్లు ఉన్నాయన్నారు. కనీసం రూ.1,500 కోట్లు చెల్లిస్తే తప్ప సేవలు కొనసాగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆశా కార్యదర్శి డాక్టర్‌ అవినాశ్‌ మాట్లాడుతూ బీమా విధానంలోకి మారే క్రమంలో ఆయుష్మాన్‌ భారత్‌తో పథకాన్ని ఇంటిగ్రేట్‌ చేస్తామని అంటున్నారని, ఆయుష్మాన్‌ భారత్‌లోని 1,500 ప్రొసీజర్లు ఎన్టీఆర్‌ వైద్యసేవ కంటే తక్కువ ప్యాకేజీల్లో ఉన్నాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ గిరిజన గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన..

భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

పరారీలోనే కాకాణి.. పోలీసుల వైఫల్యం..

For More AP News and Telugu News

Ad

Updated Date - Apr 07 , 2025 | 09:33 AM