Share News

Anitha: వారిపై పోస్టులు పెట్టారో జాగ్రత్త.. వైసీపీకి అనిత హెచ్చరిక

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:43 PM

Vangalapudi Anitha: వైఎస్సార్సీపీపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి చెందిన మహిళా నేతలు తాము మహిళలు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బాధిత మహిళలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anitha: వారిపై పోస్టులు పెట్టారో జాగ్రత్త.. వైసీపీకి అనిత హెచ్చరిక
Home Minister Vangalapudi Anitha

అమరావతి, ఫిబ్రవరి 1: వైసీపీ నేతలు మహిళలు అనే సంగతి మర్చిపోయి బాధిత మహిళ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న (శుక్రవారం) శ్రీకాకుళం జిల్లాలో బాలికను ఒక వ్యక్తి కొడితే గ్యాంగ్ రేప్ అని వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేశారన్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో బాలిక ఇష్యూ‌కు సంబంధించి నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్నామన్నారు. మాజీ మంత్రి ధర్మాన , మరికొందరు వైసీపీ నేతలు బాలిక ఇంటికి వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబం అత్యాచారం జరగలేదని ఫిర్యాదు ఇచ్చినా కావాలనే వైసీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారన్నారు.


ఎవరైనా సరే నిందితులను 24 గంటల్లో పట్టుకుంటున్నామన్నారు. మహిళలతో గంట, అరగంట అన్నవారు వైసీపీలో మంత్రులు అయ్యారని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో మహిళలపై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం మీద బురదజల్లే క్రమంలో వైసీపీ నేతలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. నిజం తెలుసుకోకుండా ట్విట్టర్, సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు పెడితే వెంటనే అరెస్టులు ఉంటాయని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరికలు చేశారు.

ఆ రాష్ట్రాలకు వరాలు.. మిగితా వాటిపై వివక్షా


కాగా.. శ్రీకాకుళంలో బీఎస్సీ విద్యార్థినిపై దాడి తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాకు చెందిన యువతి శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఇంటర్న్‌షిప్ చేస్తున్న యువతి కళాశాలకు వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలో నిన్న పుస్తకాల కోసం బయటకు వెళ్లిన విద్యార్థిని రాత్రి సమయంలో హాస్టల్ సమీపంలోని అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని తోటి విద్యార్థినినులు గుర్తించి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని శరీరంపై గాయాలు ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు ఏమీ లేవని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే విద్యార్థినిపై దాడికి సంబంధించి మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు ఆరా తీశారు. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

Wine Shops: వైన్‌షాపుల కోసం దరఖాస్తు చేసుకోండి

పండుగ లాంటి వార్త.. 12 లక్షల వరకు నో ట్యాక్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:48 PM