Share News

టీడీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:43 AM

టీడీపీలో కుటుంబ సాధికార సారథు ల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు వడ్రాణం హరిబాబు నాయుడు అన్నారు. ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథు లు ఇన్‌చార్జిలుగా వ్యవహరి స్తారని, పార్టీలో ఉన్న సెక్షన్‌ ఇన్‌చార్జిలందరిని కుటుం బ సాధికార సారథులుగా పిలవటం జరుగుతుందన్నారు.

 టీడీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి
గన్నవరం టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న నియోజకవర్గ పరిశీలకులు వడ్రాణం హరిబాబు నాయుడు

గన్నవరం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : టీడీపీలో కుటుంబ సాధికార సారథు ల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు వడ్రాణం హరిబాబు నాయుడు అన్నారు. ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథు లు ఇన్‌చార్జిలుగా వ్యవహరి స్తారని, పార్టీలో ఉన్న సెక్షన్‌ ఇన్‌చార్జిలందరిని కుటుం బ సాధికార సారథులుగా పిలవటం జరుగుతుందన్నారు. స్థానిక టీడీపీ కార్యాల యంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు ఉంగుటూరు నాయకుల కు కుటుంబ సాధికార సారథుల నియమకాలపై ఆ మండల అధ్యక్షుడు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వడ్రాణం హరిబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారధి ఇన్‌చార్జిగా ఉంటారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యనారాయణ ప్రసాద్‌(సూర్యం), టీడీపీ నాయకులు కొండేటి వెంకటేశ్వరరావు, సుంకర విజయలక్ష్మీ, కొండేటి కొండలరావు, గోగినేని విష్ణు వర్ధనరావు, రవి, బెజవాడ నాగేశ్వరరావు, బాబి, జల్లెడ శ్రీమ న్నారాయణ, కుందేటి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ కమిటీలు పారదర్శకంగా ఉండాలి

హనుమాన్‌జంక్షన్‌ : టీడీపీ గ్రామ కమిటీ నియామకాలు వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండేలా మండల నాయకత్వం బాధ్యత తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం హరిబాబు అన్నారు. శనివారం రాత్రి స్థానిక విజయవాడ రోడ్డులో పార్టీ కార్యాలయంలో పార్టీ అధిష్టానం సం స్థాగత ఎన్నికలకు నోటీఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాలు మేరకు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అధ్యక్షతనకార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు చిరమామిళ్ల సూర్యం, పుట్టా సురేశ్‌, గుండపనేని ఉమావ రప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, వేగిరెడ్డి పాపారావు, కొమ్మారెడ్డి రాజేశ్‌, మొవ్వా వెంకటేశ్వరరావు, వడ్డిల్లి లక్ష్మి, మండాది రవీంద్ర, చలసాని శ్రీనివాసరావు, దయాల రాజీవ్‌కాంత, చిన్నాల లక్ష్మీనారాయణ, మొవ్వా వేణుగోపాల్‌, చెరుకూరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:43 AM