Share News

హక్కులపై అవగాహన అవసరం

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:09 AM

వినియోగదారుల హక్కులు, చట్టంపై విద్యార్థులకు అవగాహన అవసరమని వినియోగ దారుల కమిషన అధ్యక్షుడు కరణం కిషోర్‌ కుమార్‌ అన్నారు.

హక్కులపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న కరణం కిషోర్‌ కుమార్‌

కర్నూలు అర్బన, మార్చి 15(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల హక్కులు, చట్టంపై విద్యార్థులకు అవగాహన అవసరమని వినియోగ దారుల కమిషన అధ్యక్షుడు కరణం కిషోర్‌ కుమార్‌ అన్నారు. శనివారం కేవీఆర్‌ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినియోగ దారుల హక్కులు, చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా పౌరసరఫ రాల అధికారి రాజా రఘువీర్‌, ప్రిన్సిపాల్‌ వీవీఎస్‌ కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణం కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ వినియోగదారులు తమ హక్కులను తెలుసు కొని అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తే ప్రశ్నించి వారితోపాటు మిగతా వినియోగదారులకు కూడా న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమం లో తూనికలు, కొలత శాఖ ఇన్సపెక్టర్‌ పరమేష్‌, అడిషనల్‌ సప్లయ్‌ అఫీసర్‌ రామాంజనేయరెడ్డి, కామర్స్‌ విభాగాధిపతి కె.వెంకటరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 01:09 AM