Share News

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:13 AM

భావితరాలకు ఉన్నత భవిష్యత ఇచ్చేందుకు ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి రాఘవేంద్రరెడ్డి, మాజీ సర్పంచ టీడీపీ నియోజకవర్గ నాయకులు రఘునాథ్‌రెడ్డిలు అన్నారు.

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
స్వచ్ఛాంధ్ర .. స్వచ్ఛ దివస్‌ర్యాలీలో పాల్గొన్న రాఘవేంద్రరెడ్డి

నియోజకవర్గ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి

మంత్రాలయం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): భావితరాలకు ఉన్నత భవిష్యత ఇచ్చేందుకు ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి రాఘవేంద్రరెడ్డి, మాజీ సర్పంచ టీడీపీ నియోజకవర్గ నాయకులు రఘునాథ్‌రెడ్డిలు అన్నారు. శనివారం గ్రామ కార్యదర్శి వేణుగోపాల్‌, ఉన్నత పాఠశాల హెచఎం నీలకంఠస్వామి ఆధ్వర్యంలో స్వచ్చాంధ్ర. స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో భాగంగా జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలో పాల్గొని వారు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు సుందరంగా పరిశుభ్రంగా, ఆహ్లదకరమైన వాతావరణం కల్పించే విధంగా ప్రతి మూడో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వచ్చతపై దృష్టి సారించి అందరిని భాగస్వాములని చేశారని అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ తమ కాలనీల్లో పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు ఎర్రన్న, ఫిజికల్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌, జగ ధీష్‌, కృపానంద, సుభాష్‌, ఈర మ్మ, తారాదేవి, షఫీ, కేశన్న, పోలి వీరేష్‌, శివ తదితరులు పాల్గోన్నారు.

పెద్దకడుబూరు: ప్లాస్టిక్‌ వినియోగంతో ఎంతో ప్రమాదం ఉందని వాటి నుంచి సమాజాన్ని దూరంగా ఉంచి ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పెద్దకడుబూరులో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్‌ కవర్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల కన్వినర్‌ బసలదొడ్డి ఈరన్న, కురువ మల్లికార్జున, విజయ్‌, యేసేబు, మీసేవ ఆంజ నేయులు, నరసింహారెడ్డి, అయ్యప్ప, రామాంజులు, సత్యన్నగౌడు, శివ,వీరేష్‌ గౌడ్‌ లు పాల్గొన్నారు.

నందవరం: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో పుల్లయ్య తెలిపారు. హలహర్విలో ఎంపీడీవో, నందవరంలో సర్పంచ పార్వతి, ఉప సర్పంచ శివారెడ్డిగౌడు, ముగతిలో సర్పంచ విరుపాక్షిరెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర- స్వర్ణ దివాస్‌ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమం ఈవోపీఆర్డీ సందీప్‌, పంచాయతీ కార్యదర్శి బసవరాజు, ఉరుకుందు, రమేషప్పగౌడు, దత్తప్పగౌడు, యల్లాగౌడు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 01:13 AM