Share News

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:24 AM

అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకుంటే సహించేది లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం: ఎమ్మెల్యే
వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

మిడుతూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకుంటే సహించేది లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎమ్మెల్యేతో పాటు ఆర్డీవో నాగజ్యోతి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు జరగకుండా కొందరు వ్యక్తులు పిటిషన్లు వేస్తున్నారని, అలాంటి పిటిషన్లకు బయపడేది లేదని ఆయన మండిపడ్డారు. వారు పిటిషన్లు వేస్తే తాను కూడా పిటిషన్లు వేస్తానని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వివిధ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. ఎంపీడీవో దశరథ రామయ్య, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఈవోఆర్డీ సంజన్న, ఎస్‌ఐ ఓబులేసు, సర్పంచ్‌ జయలక్ష్మమ్మ, టీడీపీ మండల కన్వీనర్‌ కాతా రమేష్‌ రెడ్డి, వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 01:24 AM