సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు వరం
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:56 AM
సీఎం సహాయ నిధి పేదలకు వరమని నియోజక టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. శనివారం స్వగృహంలో 25 మందికి రూ.17.67 లక్షలు చెక్కులను పంపిణీ చేశారు.

ఆదోని, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): సీఎం సహాయ నిధి పేదలకు వరమని నియోజక టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. శనివారం స్వగృహంలో 25 మందికి రూ.17.67 లక్షలు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణే కూటమి తొలి ప్రాధాన్యమని అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు అండనిస్తుందన్నారు.
పత్తికొండ: నియోజకవర్గంలోని 20 మంది బాఽధితులకు ఎమ్మెల్యే శ్యాంబాబు రూ. 29,44,649ల చెక్కులను పంపిణీ చేశారు. చికిత్సలు చేయించుకునే పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరమన్నారు. సాంబశివారెడ్డి, తుగ్గలి నాగేంద్ర, పురుషోత్తం చౌదరి, రామానాయుడు, బత్తిన లోక్‌నాథ్, సుధాకర్, గోవిందు తదితరులు ఉన్నారు.