Share News

శివాలయంలో పాము కలకలం

ABN , Publish Date - Feb 22 , 2025 | 12:32 AM

నంద్యాల పట్టణంలోని శ్రీరామ థియేటర్‌ సమీపంలోని శివాలయంలో నాగజాతికి చెందిన రక్తపింజరి పాము కలకలం రేపింది.

శివాలయంలో పాము కలకలం
శివాలయ ఆవరణలో పాము

నంద్యాల కల్చరల్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలోని శ్రీరామ థియేటర్‌ సమీపంలోని శివాలయంలో నాగజాతికి చెందిన రక్తపింజరి పాము కలకలం రేపింది. ఆలయ ఆవరణలో పామును చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే నిర్వాహకులు స్నేక్‌స్నాచర్‌ను పిలిపించి బంధించారు. ఆ పామును నల్లమల అడవిలో వదిలి వేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Feb 22 , 2025 | 12:32 AM