Share News

వైభవంగా శ్రీరామనవమి

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:34 AM

పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో శ్రీరామనవమి పురస్కరిం చుకొని సీతారాముల కల్యాణం నిర్వహించారు. రోడ్లు భవనాల శాటమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులు, కుమారుడు బీసీ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీరామనవమి
కల్యాణం నిర్వహిస్తున్న మంత్రి బీసీ దంపతులు

డోన్‌, ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాలో కల్యాణం

బనగానపల్లెలో పాల్గొన్న మంత్రి బీసీ, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ రాణా

బనగానపల్లె, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో శ్రీరామనవమి పురస్కరిం చుకొని సీతారాముల కల్యాణం నిర్వహించారు. రోడ్లు భవనాల శాటమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులు, కుమారుడు బీసీ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. కలెక్టర్‌ రాజకుమారి గణియా, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళ్యాణ వేదికను భారీగా ఏర్పాటు చేసి 2 వేలకు మంది భక్కుతలు తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం అర్చకులు ఆనంద ప్రసాద్‌ ఆధ్వర్యంలో సీతారాముల వారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన పట్టు వస్త్రాలతో సీతారాముల విగ్రహాన్ని అలంకరించారు. బీసీ దంపతులు, కుటుంబ సభ్యులు ఇంటి వద్దనుంచి పట్టువస్తాలు, చీరె సారె తలంబ్రాలు మేళతాళాలతో ఆంజనేయస్వామి వద్దకు తీసుకువచ్చారు. ఉదయం 11,30 గంటలకు ప్రారంభమైన కల్యాణం నిర్ణీత ముహూర్తంలో పూర్తి చేశారు. కళ్యాణోత్సవంలో రాములవారి తరుపున మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరమ్మ, సీతమ్మ తరుపున మంత్రి కుమార్తె బీసీ మనోహరమ్మ, రమణారెడ్డి, దంపతులు పెళ్లిపీటలపై కూర్చొని జరిపించారు. మంత్రి దంపతులతో పాటు కలెక్టర్‌, ఎస్సీ ముత్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం గ్రామో త్సవం నిర్వహించారు. సీఐలు ప్రవీణ్‌కుమార్‌, మంజునాథ్‌రెడ్డి, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి, పోలీస్‌ సిబ్బంది, హోంగార్డులు బందోబస్తును నిర్వహించారు. టీడీపీ నాయకులు టంగుటూరు శ్రీనయ్య, కూరగా యలశేఖర్‌, ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని బోయపేటలోని సీతారాముల ఆలయంలోను, నాయిబ్రాహ్మణ కాలనీలోను శ్రీరాముల ఆలయంలోను, అలాగే పట్టణంలోని బుడగజంగాల కాలనీలోను, సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు.

ప్యాపిలి: మండలంలోని ప్యాపిలి, కలచట్ల, ఏనుగమర్రి, చంద్రపల్లి, ఏనుగమర్రి, జలదుర్గం, మెట్టుపల్లి గ్రామాల్లో ఆదివారం సీతారాముల కలాణం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

డోన్‌ రూరల్‌ : పట్టణ సమీపంలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం నిరర్వహించారు. టీడీపీ యువ నాయకుడు ధర్మవరం మన్నె గౌతమ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. శ్రీషిరిడీ సాయిబాబా కమిటి సభ్యులు సీఎం శ్రీనివాసులు, ఆలా మల్లికార్జున, భక్తులు తదితరులు కళ్యాణోత్సవ పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా రామచంద్రమాలిక్‌బాబా ఆలయంలో కల్యాణం వైభవంగా నిర్వహించారు. కమలాపురం, గోసానిపల్లె, సోంపురం, బట్వారిపల్లె, చిన్నమల్కాపురం గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు.

శిరివెళ్ల: మండలంలోని యర్రగుంట్ల, శిరివెళ్ల, వెంకటాపురం తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.

కొలిమిగుండ్ల: మండలంలోని గ్రామాల్లో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. వేద పండుతుల మంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయ పద్దతిలో సాగిన కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు తరలి వచ్చారు. మీర్జాపురం, కొలిమిగుండ్ల, అంకిరెడ్డిపల్లె, కనకాద్రిపల్లె, ఇటిక్యాల, బెలుం, పెట్నికోట తదితర గ్రామాల్లో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో డా.మల్లికార్జునరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, పోరెడ్డి రామచంద్రారెడ్డి భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా కొలిమిగుండ్ల కొండపై వెలసిన లక్ష్మీనరసింహ స్వామి గ్రామోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పండితులు ఆలూరు నరసింహప్రసాద్‌, రాఘవేంద్ర ప్రసాద్‌ కుటుంబ సభ్యులు ఉత్సవ మూర్తులను పల్లకీలో ఉంచి పూజలు నిర్వహించారు.

ఉయ్యాలవాడ: మండలంలోని ఉయ్యాలవాడ, హరివరం, సర్వాయిపల్లె, మాయలూరు తదితర గ్రామాల్లో కల్యాణం జరిపించారు. ఉయ్యాలవాడలో టీడీపీ మండల అధ్యక్షుడు బోరెడ్డి శేఖర్‌రెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. అర్చకులు, భాస్కరశర్మ, కీర్తిలక్ష్మణస్వామి, రమణయ్య వేదమంత్రాలు, వాయిద్యాల మద్య కల్యాణం జరిపించారు.

ఆళ్లగడ్డ: పట్టణంలోని కోదండ రామాలయం, అమ్మవారి శాల, అభయాంజనేయ ఆలయాల్లో శ్రీరామనవమి నిర్వహించారు. అర్చకులు కల్యాణం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.

డోన్‌ టౌన్‌: పట్టణంలోని పాతపేట రామాలయం, ఇందిరానగర్‌ ఆంజనేయస్వామి ఆలయం, పాతబుగ్గ రామేశ్వరాల యాలతో పాటు పలు ఆలయాల్లో ఆదివారం వేడుకలు నిర్వహించారు. అర్చకులు, వేద పండి తులు మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం నిర్వహిం చారు. స్వామి, అమ్మవార్లకు భక్తులు పట్టువస్త్రాలు సమర్పించారు.

Updated Date - Apr 07 , 2025 | 12:34 AM